News November 20, 2024
ఝార్ఖండ్ EXIT POLLS: యాక్సిస్ మై ఇండియా కాన్ఫిడెన్స్ ఏంటి?
ఝార్ఖండ్‌పై ఇప్పటి వరకు 5 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేశాయి. 81 సీట్లున్న ఈ రాష్ట్రంలో BJP కూటమి మ్యాజిక్ ఫిగర్ 41ని దాటేస్తుందని మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా ఒక్కటే BJP 25కు పరిమితం అవుతుందని, ఇండియా కూటమి 53 సీట్లతో అధికారం చేపడుతుందని పేర్కొంది. అటూ ఇటూ కాకుండా పక్కాగా సీట్లు అంచనా వేయడంపై నెటిజన్లు సర్‌ప్రైజ్ అవుతున్నారు.
Similar News
News November 20, 2024
నిన్న అమెరికా.. నేడు బ్రిటన్ క్షిపణులు ప్రయోగించిన ఉక్రెయిన్
అమెరికా లాంగ్ రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించి కాక పుట్టించిన ఉక్రెయిన్ తాజాగా బ్రిటిష్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. నార్త్ కొరియా బలగాలను రష్యా మోహరించిన కారణంగా తమ స్టార్మ్‌షాడో క్షిపణుల వినియోగానికి ఉక్రెయిన్‌కు UK అనుమతించింది. ఇరు దేశాల యుద్ధం తారస్థాయికి చేరడంతో రష్యా ప్రతిచర్యలపై ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది.
News November 20, 2024
క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ అమ్మక తప్పదా?
క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్నెట్ సెర్చ్ మార్కెట్‌లో గూగుల్ గుత్తాధిపత్యంపై కోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ బ్యాలెన్స్ అవ్వాలంటే క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ విక్రయించేలా ఆదేశాలివ్వాలని కోర్టును అమెరికా న్యాయశాఖ(DoJ) కోరింది. అయితే.. క్రోమ్‌ను విక్రయిస్తే తమ వ్యాపారాలకు, వినియోగదారులకు నష్టం వాటిల్లుతుందని గూగుల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
News November 20, 2024
మీ నిర్లక్ష్య వైఖరికి ఎంత మంది బలికావాలి?: హరీశ్ రావు
TG: నారాయణపేట(D) మాగనూర్ ZP స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు <<14664383>>అస్వస్థతకు<<>> గురవడంపై హరీశ్ మండిపడ్డారు. ‘వాంకిడి స్కూల్‌లో ఫుడ్ పాయిజన్‌తో పిల్లాడు వెంటిలేటర్‌పై ఉన్నాడు. నల్గొండలో పాము కాటుతో విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు మరో ఘటన జరిగింది. మీ నిర్లక్ష్య వైఖరికి ఎంతమంది బలికావాలి? ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుకునేది?’ అని నిలదీశారు.