News November 23, 2024

ఝార్ఖండ్ రిజల్ట్స్.. సీఎం ముందంజ

image

ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బర్హత్‌ నుంచి బరిలో ఉన్న JMM చీఫ్, సీఎం హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే ఎన్డీఏ లీడింగ్‌లో కొనసాగుతోంది. 9 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉండగా ఇండియా కూటమి 3 చోట్ల ఆధిక్యం కొనసాగిస్తోంది.

Similar News

News November 23, 2024

ఓట్లు పెరిగితే BJP+ సీట్లు పెరుగుతాయ్!

image

మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజీ పెరిగేకొద్దీ NDA సీట్లు పెరుగుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 61.4 ఓటింగ్ నమోదైంది. ఈసారి అది 65%కు చేరుకుంది. 2024 లోక్‌సభ పోలింగ్ 61%తో పోలిస్తే ఇది ఎంతో ఎక్కువ. మహారాష్ట్రలో BJP 9, శివసేన 7, NCP 1 సీటే గెలిచాయి. కాంగ్రెస్ 13, SSUBT 9, NCPSP 8 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఈ లెక్కన MVAకు 153, NDAకు 126 రావాలి. అయితే ఇప్పుడు NDA 220 సీట్లు గెలిచేలా ఉంది.

News November 23, 2024

‘మెకానిక్ రాకీ’ వచ్చేది ఈ ఓటీటీలోనే!

image

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘మెకానిక్ రాకీ’ సినిమా నిన్న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ ముళ్లపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. థియేటర్ రన్ పూర్తయ్యాక ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు.

News November 23, 2024

సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతికుమారి

image

TG: సీఎస్ శాంతికుమారి సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొని తమ కుటుంబ వివరాలు సమర్పించారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికే కోటి కుటుంబాల గణన పూర్తయింది. కొన్ని జిల్లాల్లో నూటికి నూరు శాతం సర్వే పూర్తి చేశారు. నల్గొండ, జనగాం, ములుగు, మెదక్, భువనగిరి, జగిత్యాల, గద్వాల జిల్లాల్లో దాదాపు పూర్తైంది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.