News October 3, 2025

కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీ 2028లోగా పూర్తి: CM చంద్రబాబు

image

AP: ఈ నెల 16న PM మోదీ కర్నూలులో పర్యటించనున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులకు CM చంద్రబాబు సూచించారు. కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీని 2028లోగా పూర్తి చేస్తామన్నారు. స్థానిక పండుగలను ప్రోత్సహించేలా విజయవాడ ఉత్సవ్ తరహా ఈవెంట్లను అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలన్నారు. అసెంబ్లీలో కొందరు MLAలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, వారిని నియంత్రించే బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు.

Similar News

News October 3, 2025

‘Snapchat’ వాడుతున్నారా?

image

ప్రస్తుతం యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ‘Snapchat’ యాప్‌లోనూ ఆంక్షలు మొదలయ్యాయి. వినియోగదారులు సేవ్ చేసిన మీడియా(మెమొరీస్) డేటాను కుదించింది. ఇకపై 5GB కంటే ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవాలంటే, తప్పనిసరిగా డబ్బు చెల్లించాలి. 100GB కోసం నెలకు $1.99 నుంచి చెల్లింపు ప్లాన్‌లు మొదలవుతాయి. లేదా నెలకు $3.99 చెల్లిస్తే 250GB లభిస్తుంది. ఈ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.

News October 3, 2025

‘నాసా’ ఆపరేషన్స్ నిలిపివేత.. కారణమిదే!

image

ప్రభుత్వ నిధుల లోపం కారణంగా తమ ఆపరేషన్స్‌ను నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు ఏజెన్సీని మూసివేస్తున్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది. అక్కడి కాంగ్రెస్ కొత్త బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం <<17882827>>షట్‌డౌన్<<>> అయిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ షట్‌డౌన్ కారణంగా ISS, స్పేస్‌క్రాఫ్ట్ వంటి క్రిటికల్ ఆపరేషన్స్ మినహా మిగతా ప్రాజెక్టులను నాసా నిలిపివేసింది.

News October 3, 2025

‘శ్వేతనాగు’ సినిమా రచయిత కన్నుమూత

image

ప్రముఖ రచయిత లల్లా దేవి (82) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా నిమ్మగడ్డవారిపాలెం గ్రామానికి చెందిన ఆయన అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు. ‘లల్లా దేవి’ పేరిట కథలు, నవలలు రాశారు. దివంగత నటి సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ‘శ్వేతనాగు’ సినిమాకు కథ అందించారు. 150కి పైగా నవలలు, నాటకాలు రచించారు. వాటిలో ఆమ్రపాలి, మహామంత్రి తిమ్మరుసు వంటి నవలలు పాపులర్ అయ్యాయి.