News December 15, 2025
JIO నుంచి అదిరిపోయే ప్లాన్స్!

న్యూఇయర్ సందర్భంగా JIO కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. రూ.3,599తో రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు డైలీ 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100SMSలు లభిస్తాయి. దీంతోపాటు రూ.35,100 విలువైన Google Gemini Pro ప్లాన్ కూడా 18నెలల పాటు ఉచితం. ₹500తో 28రోజులు డైలీ 2GB, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలతో పాటు పలు OTT ప్లాట్‌పామ్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ. ₹103తో 28 రోజుల పాటు 5GB డేటా పొందొచ్చు.
Similar News
News December 16, 2025
AP న్యూస్ రౌండప్

☛ మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5కోట్లు, 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం కేటాయిస్తూ క్రీడా శాఖ స్పెషల్ CS అజయ్ జైన్ ఉత్తర్వులు
☛ నేడు TTD ధర్మకర్తల మండలి సమావేశం
☛ ఇంద్రకీలాద్రి: 5 రోజుల్లో దీక్షలు విరమించిన 5.77 లక్షల మంది భవానీలు
☛ ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి CM CBN
☛ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టుకు చెవిరెడ్డి.. విచారణ 22వ తేదీకి వాయిదా
News December 16, 2025
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.
News December 16, 2025
పుణ్యాన్నిచ్చే రెండు పవిత్ర మంత్రాలు…

1. “ఓం శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామినే నమః”
2. “ఓం శ్రీ రంగ నిలయాయై నమః”
ఈ పవిత్ర ధనుర్మాసంలో ప్రతిరోజు ఈ రెండు మంత్రాలను పఠించాలని పండితులు సూచిస్తున్నారు. శ్రీవ్రతం ఆచిరించే వారితో పాటు, పూజ చేయనివారు కూడా పఠించవచ్చని చెబుతున్నారు. పూజా మందిరంలో కొలువైన విష్ణుమూర్తి ఏ రూపాన్నైనా చూస్తూ పఠిస్తే.. సిరిసంపదలు పెరుగుతాయని అంటున్నారు. ఇంట్లో మంచి జరుగుతుందని సూచిస్తున్నారు.


