News September 2, 2025
జియో, ఎయిర్‌టెల్.. మీకూ ఇలా అవుతోందా?

జియో, ఎయిర్‌టెల్ సిగ్నల్స్ రాక యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఒకప్పటి రోజులు మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఇంట్లో ఏదో ఒకచోటే సిగ్నల్ ఉండటం, అక్కడే నిలబడి ఫోన్ వాడటం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక వీడియోలేమో ‘లోడింగ్.. లోడింగ్’ అంటున్నాయి. గ్రామాలను పక్కనపెడితే హైదరాబాద్ వంటి నగరాల్లోనూ నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఫోన్లు కలవడం లేదని చాలామంది వాపోతున్నారు. మీరేమంటారు?
Similar News
News September 3, 2025
YCP యూరియా ఆందోళనలు వాయిదా

AP: ఈ నెల 6న జరగాల్సిన యూరియా ఆందోళనలను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వైసీపీ తెలిపింది. కాగా రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్డీఓ ఆఫీసుల ఎదుట నిరసన చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఆ తర్వాత ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించాలని భావించింది. టీడీపీ నేతలు ఎరువులను బ్లాక్ చేసి పక్కదారి పట్టిస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది.
News September 3, 2025
రేపు చైనా విక్టరీ పరేడ్.. హాజరుకానున్న షరీఫ్, మునీర్

వరల్డ్ వార్-2లో గెలిచి 80 ఏళ్లవుతున్న నేపథ్యంలో చైనా రేపు విక్టరీ పరేడ్ నిర్వహించనుంది. దీనికి పాక్ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ హాజరుకానుండటం గమనార్హం. రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా నియంత కిమ్ సహా ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికాకు చెందిన పలు దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ పరేడ్‌లో సైనిక శక్తిని చాటేందుకు అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, వార్ హెడ్లను చైనా ప్రదర్శించనుంది.
News September 2, 2025
ఆ ప్రచారంతో ఆరు నెలలు ఆఫర్లు రాలేదు: అనుపమ

‘రంగస్థలం’ సినిమా ఆఫర్ వదులుకున్నానని తనపై తప్పుడు ప్రచారం జరిగిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ చేశారనే ప్రచారంతో తాను ఆఫర్లు లేకుండా 6 నెలలు ఖాళీగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘రంగస్థలంలో నటించాలని సుకుమార్ అడిగారు. నేను అందుకు సిద్ధమయ్యాను. అదే సమయంలో వారు వేరే హీరోయిన్‌ను నా స్థానంలో తీసుకున్నారు’ అని చెప్పారు. ఈ మూవీలో సమంత నటించిన సంగతి తెలిసిిందే.