News October 8, 2025
జియో భారత్ కొత్త ఫోన్.. ఫీచర్లేమిటంటే

జియో భారత్ కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. పెద్దలు, పిల్లల వినియోగానికి అనుగుణమైన సెక్యూరిటీ ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. లొకేషన్ మానిటరింగ్, యూసేజ్ మేనేజింగ్ వ్యవస్థతోపాటు బ్యాటరీ బ్యాకప్ 7 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. కాల్స్, మెసేజ్‌ల నియంత్రణ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రారంభ ధర ₹799గా నిర్ణయించింది. ఇప్పటికే తెచ్చిన జియో పీసీలలో AI క్లాస్ రూమ్ ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నామని తెలిపింది.
Similar News
News October 8, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ ఉదయంతో పోల్చితే సాయంత్రానికి భారీగా పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,150 పెరగ్గా ఇప్పుడు మరో రూ.760 ఎగిసి రూ.1,23,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ఉదయం రూ.1,050 ఎగబాకగా సాయంత్రానికి మరో రూ.700 పెరిగి రూ.1,13,600 పలుకుతోంది. అటు KG వెండి ధర మార్నింగ్ రూ.100 తగ్గగా ఇప్పుడు రూ.3000 పెరిగి రూ.1,70,000కి చేరుకుంది.
News October 8, 2025
యాక్టింగ్ PMలా అమిత్ షా తీరు: మమత

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై WB CM మమత ఫైరయ్యారు. ఆయనో యాక్టింగ్ PMలా మారారని దుయ్యబట్టారు. ‘షాను ఎక్కువగా నమ్మొద్దని PMకి చెప్పాలనుకుంటున్నా. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను మోసగించి రాజైన మిర్ జాఫర్ లాంటి వ్యక్తి షా. విచిత్రమేమంటే ఆయన గురించి ఈ విషయాలు మోదీకి కూడా తెలుసు’ అని మమత వ్యాఖ్యానించారు. అమిత్ షా కోరిక మేరకే CEC SIR పేరిట ఓటర్ లిస్టుల సవరణ నిర్వహిస్తోందని విమర్శించారు.
News October 8, 2025
SBI డౌన్.. UPI సేవలకు అంతరాయం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) UPI సేవల్లో అంతరాయం ఏర్పడింది. ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామంటూ కస్టమర్లు SMలో రిపోర్ట్ చేస్తున్నారు. దీనిపై SBI స్పందించింది. టెక్నికల్ సమస్య వల్ల UPI సేవలు డిక్లైన్ అవుతున్నాయంది. అంతరాయానికి చింతిస్తున్నామని, 8PM లోగా సరిచేస్తామని స్టేట్‌మెంట్ విడుదల చేసింది. అయితే ఆ సమయం దాటినా ఇంకా సమస్య పరిష్కారం కాలేదని కస్టమర్లు వాపోతున్నారు. మీకూ ఈ సమస్య ఎదురైందా?