News February 24, 2025
జియో క్రికెట్ డేటా ప్యాక్.. 90 రోజులు ఉచితంగా!

క్రికెట్ అభిమానుల కోసం జియో సరికొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా మారిన విషయం తెలిసిందే. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ, IPL టోర్నమెంట్ కోసం డేటాతో పాటు సబ్స్క్రిప్షన్ ఉండే ప్యాక్ తీసుకొచ్చింది. రూ.195 చెల్లిస్తే 15GB డేటాతో పాటు 90 రోజుల పాటు ‘JIO HOTSTAR’ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు.
Similar News
News January 10, 2026
ఆసిఫాబాద్: సెలవుల్లో జాగ్రత్త.. పిల్లలపై ఓ కన్నేయండి

ఆసిఫాబాద్ జిల్లాలో నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు విద్యార్థులు ఇంట్లోనే ఉండనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వారి కదలికలపై నిఘా ఉంచాలని అధికారులు సూచించారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా వాడకుండా చూడాలని, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని కోరారు. అలాగే పిల్లలు ద్విచక్ర వాహనాలతో రోడ్లపైకి రాకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.
News January 10, 2026
‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై నిషేధం

బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్ కంపెనీ ‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై TG డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధం విధించింది. చిన్నారులకు ఉపయోగించే ఈ సిరప్‌లో విషపూరితమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగం ప్రాణాంతకమంటూ ‘స్టాప్ యూజ్’ నోటీసు జారీ చేశారు. ‘ప్రజలు ఈ సిరప్‌ను వాడటం వెంటనే ఆపేయాలి. మీ దగ్గర ఈ మందు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయాలి’ అని కోరారు.
News January 10, 2026
మహిళా ఆఫీసర్, మంత్రిపై ఆరోపణలు.. ఖండించిన IAS అసోసియేషన్

TG: మహిళా IASపై ఓ మంత్రి ఆపేక్ష చూపిస్తున్నారంటూ ఓ న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేయడాన్ని TG IAS ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. మహిళా అధికారిపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది. దీనిని మహిళా ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్‌పై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థను డిమాండ్ చేసింది. ఇలాంటి దురుద్దేశపూర్వక కంటెంట్‌ను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలను హెచ్చరించింది.


