News July 22, 2024
జియో.. ఆ ప్లాన్ గడువు పెంపు

రీఛార్జ్ ధరలు పెంచిన అనంతరం రిలయన్స్ జియో రూ.349 ప్లాన్‌లో స్వల్ప మార్పులు చేసింది. గతంలో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే ఉండగా తాజాగా 30 రోజులకు పెంచింది. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMSలు, 2GB డేటాను యూజర్లు వాడుకోవచ్చు. గతంలో ఈ ప్లాన్ ధర రూ.299గా ఉండేది. కాగా రీఛార్జ్ ధరలు పెంచడంతో యూజర్లు BSNLకు పోర్ట్ అవుతామంటూ కామెంట్ చేస్తున్నారు.
Similar News
News February 14, 2026
మరో 2 కిలోలు తగ్గడమే లక్ష్యమంటున్న లోకేశ్

AP: మంత్రి లోకేశ్ ఇటీవల మరింత వెయిట్ లాసై ఫిట్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘బరువు మరీ ఎక్కువ తగ్గుతున్నానని అంతా అంటున్నారు. కానీ ఇంకో 2 కిలోలు తగ్గితే నా లక్ష్యం పూర్తవుతుంది. అటు రోజూ కొంతమంది నేతలతో డిన్నర్ చేసి వాళ్ల బాగోగులు తెలుసుకోవడం PM మోదీ నుంచి నేర్చుకున్నా. క్వాంటం, AI సీఎం చూసుకుంటారు. నేను మానవీయ సంబంధాలు చూసుకుంటా’ అని అసెంబ్లీ లాబీలో నేతలతో లోకేశ్ అన్నారు.
News February 14, 2026
40 తర్వాత ఆహారంలో ఇవి చేర్చుకోండి

వయస్సు మీద పడుతున్న కొద్దీ కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. 40 ఏళ్లకు పైబడిన తరువాత జంక్ ఫుడ్‌కు పూర్తిగా స్వస్తి చెప్పి ఆహారంలో టమాటాలు, చిలగడదుంపలు, కోడిగుడ్లు, పుట్ట గొడుగులు, యాపిల్ పండ్లు, బాదం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో అజీర్తి, గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి. కొలెస్ట్రాల్, బీపీ నియంత్రణలో ఉండి గుండెజబ్బులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.
News February 14, 2026
IND vs PAK: హ్యాండ్ షేక్‌పై పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

T20 WCలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ‘హ్యాండ్ షేక్’ అంశం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. Asia Cupలో టీమ్ ఇండియా ప్లేయర్లు పాక్‌తో కరచాలనం చేయకపోవడం పెద్ద దుమారమే రేపింది. దాన్ని గుర్తు చేస్తూ పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పటిలాగే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, నిర్ణయం భారత్ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.


