News March 7, 2025
జియో హాట్‌స్టార్ విలీనం ఎఫెక్ట్..1,100 మందిపై వేటు

జియో హాట్‌స్టార్ సంస్థ 1,100 మంది ఉద్యోగులపై వేటు వేసింది. జూన్‌లోగా వీరందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్, కమర్షియల్, లీగల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగులను ఎక్కువగా తొలగించింది. వీరందరికి 6 నుంచి 12 నెలల జీతం ఇచ్చి వదిలించుకోనుంది. కాగా విలీనం తర్వాత జియో హాట్‌స్టార్ విలువ రూ.70,352 కోట్లుగా ఉంటుందని అంచనా.
Similar News
News March 7, 2025
హిందీపై స్టాలిన్ ప్రేలాపనలకు అర్థం లేదు: అన్నామలై

NEP అనుకూల సంతకాల సేకరణకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని TN BJP చీఫ్ అన్నామలై అన్నారు. హిందీపై CM స్టాలిన్‌ది నకిలీ ఉద్యమమని, ఆయన చెప్పేవన్నీ వ్యర్థ ప్రేలాపనలని విమర్శించారు. ‘https://puthiyakalvi.in/ ద్వారా మేం చేపట్టిన ఉద్యమానికి 36 గంటల్లోనే 2 లక్షల మందికి పైగా మద్దతిచ్చారు. రాష్ట్ర వ్యాప్త సంతకాల సేకరణకు ఊహించని స్పందన వస్తోంది. ఇక స్టాలిన్ ప్రేలాపనలకు అర్థంలేదు’ అని ట్వీట్ చేశారు.
News March 7, 2025
BREAKING: స్కూల్ విద్యార్థులకు GOOD NEWS

AP: విద్యార్థులపై బ్యాగ్ భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ఇకపై సెమిస్టర్ల వారీగా సబ్జెక్టుల పుస్తకాలను బైండ్ చేసి ఇస్తామన్నారు. అలాగే వారికి నాణ్యమైన యూనిఫామ్‌తో కూడిన కిట్ ఇస్తామని చెప్పారు. వన్ క్లాస్-వన్ టీచర్ విధానాన్ని 10K స్కూళ్లలో అమలు చేస్తామని వెల్లడించారు.
News March 7, 2025
త్వరలో టీచర్ల బదిలీల చట్టం: మంత్రి లోకేశ్

AP: విద్యావ్యవస్థలో టీచర్లది కీలక పాత్ర అని, వారిపై భారం ఉంటే పనిచేయలేరని మంత్రి లోకేశ్ చెప్పారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల బదిలీల చట్టం తీసుకొస్తున్నామని ప్రకటించారు. చాలా పారదర్శకంగా సీనియారిటీ జాబితాను టీచర్ల ముందు పెడతామని పేర్కొన్నారు. ఏదైనా తప్పులు ఉంటే వెంటనే కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.