News July 11, 2024
జియో IPO విలువ ₹9లక్షల కోట్లకుపైనే ఉండొచ్చు: జెఫరీస్
జియో ఐపీఓపై ట్రేడ్ వర్గాల్లో ప్రచారం సాగుతున్న వేళ జెఫరీస్ సంస్థ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2025లో జియో (రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్) మెగా ఐపీఓకు వెళ్లొచ్చన్న జెఫరీస్ ఆ విలువ ₹9.3లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. RIL షేర్ ప్రైస్ మీద జియో షేర్ 7-15% ఎక్కువ ఉంటుందని పేర్కొంది. కాగా జియో కనిష్ఠంగా 5% షేర్లను <<13570017>>ఐపీఓలో<<>> పెట్టినా ఆ విలువ ₹55వేలకోట్లు ఉంటుందని ఇటీవల జెఫరీస్ తెలిపింది.
Similar News
News January 20, 2025
బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా
రేపు నల్గొండలో BRS చేపట్టాల్సిన మహాధర్నా వాయిదా పడింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని చెప్పిన హైకోర్టు, విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఈనెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదన్నారు.
News January 20, 2025
ఈ సమయంలో బయటకు రాకండి: డాక్టర్లు
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మధ్యాహ్నం ఎండ, వేడి ఎక్కువగా ఉంటే.. ఉదయం, రాత్రి విపరీతమైన చలి ఉంటోంది. పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రతల్లో తేడా 18 డిగ్రీల వరకు ఉంటోంది. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న అత్యల్పంగా 6.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.
News January 20, 2025
ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు: లోకేశ్
పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం ఉందని మంత్రి నారా లోకేశ్ స్విస్ పారిశ్రామికవేత్తలకు తెలిపారు. జ్యూరిచ్లో వారితో భేటీ అయిన లోకేశ్, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తాము ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ, విశాలమైన రోడ్లు, తీర ప్రాంతం, నౌకాశ్రయాలు ఉన్నాయని చెప్పారు. త్వరలో మరిన్ని పోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు.