News December 11, 2024
జియో కొత్త ప్లాన్.. అదిరిపోయే బెనిఫిట్స్

న్యూ ఇయర్ సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.2025తో రీఛార్జ్ చేసుకునే ఈ ప్లాన్లో 200 రోజుల పాటు రోజుకు 2.5GB ఇంటర్నెట్, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, SMSలు చేసుకోవచ్చు. దీనికి తోడుగా రూ.2150 విలువైన(రూ.500 అజియో, ఈజ్ మై ట్రిప్ రూ.1500, స్విగ్గీ రూ.150) కూపన్లను అందిస్తోంది. డిసెంబర్ 11 నుంచి జనవరి 11, 2025 వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉండనుంది.
Similar News
News January 17, 2026
కొరియన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..

ప్రస్తుతం ఎక్కడ చూసినా కొరియన్ బ్యూటీ ట్రెండ్ వైరల్ అవుతోంది. కొరియన్లలా కనిపించాలని వారు వాడే ఉత్పత్తులు వాడితే సరిపోదంటున్నారు నిపుణులు. వారి బ్యూటీ సీక్రెట్ ఆరోగ్యకరమైన అలవాట్లే కారణం. మార్నింగ్ స్కిన్కేర్ రిచ్యువల్, ప్రోబయోటిక్స్ ఆహారాలు, తగిన నిద్ర, నీరు తీసుకోవడం, సన్ స్క్రీన్ ఎక్కువగా వాడటం, ప్రకృతిలో సమయం గడపడం కొరియన్ల అలవాటు. వీటివల్లే వారు అందంగా, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
News January 17, 2026
శ్రీనివాసుడికి శనివారం ఎందుకు ప్రీతికరమైనది?

వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరమైన రోజు. ఓంకారం ప్రభవించిన, స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న, ఆలయ ప్రవేశం చేసిన రోజు కూడా శనివారమే. తన భక్తులను పీడించనని శనిదేవుడు శ్రీనివాసుడికి మాట ఇచ్చింది కూడా ఈ రోజే. అందుకే 7 శనివారాలు నియమంతో స్వామిని పూజించి, 7 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. స్వామివారికి శనివారంతో ఉన్న ఈ అనుబంధం వల్లే భక్తులు శనివారాలు ఉపవాసాలు ఉంటారు.
News January 17, 2026
మొక్కజొన్నలో బొగ్గు కుళ్లు తెగులు లక్షణాలు

మొక్కజొన్నలో పూత దశ తర్వాత నేలలో తేమ శాతం తగ్గడం, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల బొగ్గు కుళ్లు తెగులు కనిపిస్తుంది. నేలలోని శిలీంధ్రం మొక్కల వేర్ల ద్వారా కాండం పైభాగానికి వ్యాపించి గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. ఈ తెగులు వల్ల పంట కోత దశకు రాకముందే కాండం భాగం విరిగి మొక్కలు నేలపై పడిపోతాయి. ఇలాంటి మొక్కలను చీల్చి చూసినపుడు లోపల బెండు భాగం కుళ్లి, తెలుపు రంగు నుంచి నలుపు రంగుకు మారడం గమనించవచ్చు.


