News December 10, 2025

JioHotstar వైదొలగడానికి కారణాలు ఇవేనా..?

image

ICC బ్రాడ్‌కాస్టింగ్ నుంచి <<18504521>>JioHotstar<<>> తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి పలు కారణాలు చూస్తే ఒక్కో మ్యాచ్‌కు జియో ₹138Cr చెల్లిస్తోంది. ఇది IPL మ్యాచ్ (₹114 Cr) కంటే ఎక్కువ. మరోవైపు 179 ICC మ్యాచ్‌లలో భారత్ 28 మాత్రమే ఆడుతోంది. మిగతా దేశాలవి అయితే వ్యూవర్‌షిప్, యాడ్ రెవెన్యూ తక్కువ వస్తాయి. కాగా ఇప్పుడు బలమైన పోటీదారు లేకపోవడంతో ప్రైస్ తగ్గించి తమకే కాంట్రాక్టు ఇస్తారని జియో భావిస్తోంది.

Similar News

News December 14, 2025

ISIS దాడిలో ముగ్గురు అమెరికన్ల మృతి.. ట్రంప్ వార్నింగ్

image

సెంట్రల్ సిరియాలో ఐసిస్ చేసిన దాడిలో ముగ్గురు అమెరికన్లు చనిపోయారు. వీరిలో ఇద్దరు సైనికులు, ఓ పౌరుడు ఉన్నారు. ఈ ఘటనపై US అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా, సిరియాపై జరిగిన దాడి అని, బలమైన ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడితో దిగ్భ్రాంతికి గురైనట్లు సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

News December 14, 2025

ఓటుకు రూ.40వేలు.. రూ.17 కోట్ల ఖర్చు?

image

TG: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల పరిధిలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో గెలిచేందుకు రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.40వేల చొప్పున పంచడమే కాకుండా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వెండిగ్లాసులు, బంగారు నగలు పంపిణీ చేశారని తెలుస్తోంది. మద్యం పంపిణీకే రూ.4 కోట్లు ఖర్చు చేశారని టాక్. అటు మరికొన్ని చోట్ల గెలిచేందుకు అభ్యర్థులు రూ.లక్షల్లో వెచ్చించినట్లు సమాచారం.

News December 14, 2025

బాలకృష్ణ, బోయపాటి.. 4 సినిమాల్లో ఏది నచ్చింది?

image

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో సినిమా అంటే యాక్షన్ భారీ స్థాయిలో ఉంటుంది. హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వీరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు 4 సినిమాలొచ్చాయి. సింహా(2010), లెజెండ్(2014), అఖండ(2021), అఖండ-2: తాండవం(2025) మాస్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాల్లో బాలకృష్ణ గెటప్స్, డైలాగ్స్, ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. మరి వీటిలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి.