News August 29, 2024

860కి పైగా లైవ్ టీవీ ఛానల్స్‌‌‌తో JioTV+

image

JioTV+ ద్వారా 860కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌‌, ఆన్-డిమాండ్ షోలు సహా ఓటీటీల బెస్ట్ కంటెంట్‌ను ఆఫర్ చేయనున్నట్టు ఆకాశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఏజీఎం సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు. వినోదాన్ని రెట్టింపు చేసేలా అన్ని రకాల కంటెంట్‌ను ఒకే వేదికపై సులభంగా JioTV+ ద్వారా యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. ఈ వేదికను సూపర్ ఫాస్ట్ ఛానల్‌గా ఆప్టిమైజ్ చేసినట్టు వెల్లడించారు.

Similar News

News October 13, 2025

పాకిస్థాన్‌కు అఫ్గాన్ షాక్!

image

<<17987289>>వివాదం<<>> వేళ పాక్‌కు అఫ్గాన్ షాక్ ఇచ్చింది. తమ దేశంలో పర్యటిద్దామనుకున్న డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖవాజా, ISI చీఫ్ ఆసిమ్ మాలిక్ వీసాలను రిజెక్ట్ చేసింది. అటు పాక్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌ను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పాక్, లంక, అఫ్గాన్ త్వరలో ట్రై సిరీస్‌ ఆడాల్సి ఉంది. మరోవైపు భారత్‌తో సంబంధాలను తాలిబన్ ప్రభుత్వం పునరుద్ధించుకుంటోంది. ఆ దేశ మంత్రి ముత్తాఖీ IND పర్యటనలో ఉన్నారు.

News October 13, 2025

పిల్లలకు వాడకూడని 3 వస్తువులు

image

మూడేళ్లలోపు పిల్లల శరీరం అతి సున్నితమైంది. కొందరు పేరెంట్స్ వారికి హార్డ్ బ్రష్‌తో పళ్లు తోముతుంటారు. ఇది వారి మృదువైన చిగుళ్లకు హాని కలిగిస్తుంది. ఇక స్నానం చేయించేటప్పుడు స్క్రబ్బర్‌తో రుద్దడాన్ని చిన్నారుల సున్నితమైన చర్మం తట్టుకోలేదు. తలస్నానం చేయించాక హెయిర్ డ్రయ్యర్ వినియోగం వల్ల వారి కుదుళ్లు దెబ్బతిని త్వరగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా మీరు చేయిస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి. SHARE IT

News October 13, 2025

LED స్క్రీన్‌లో వేములవాడ రాజన్న దర్శనం

image

TG: వేములవాడ అభివృద్ధి పనుల నేపథ్యంలో LED స్క్రీన్ ద్వారా రాజరాజేశ్వర స్వామి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్జిత సేవలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మేడారం జాతర సందర్భంగా భక్తులు ఇక్కడికీ పెద్ద సంఖ్యలో తరలివస్తారని వెల్లడించారు. తొలుత భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక <<17983463>>ఏర్పాట్లు<<>> చేసిన విషయం తెలిసిందే.