News July 31, 2024

గవర్నర్‌గా నేడు జిష్ణుదేవ్ ప్రమాణస్వీకారం

image

తెలంగాణ గర్నవర్‌గా నియమితులైన <<13722916>>జిష్ణుదేవ్ వర్మ<<>> ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 5.03 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జిష్ణుదేవ్ 2018 నుంచి 2023 వరకూ త్రిపుర డిప్యూటీ సీఎంగా పని చేశారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలీ అయిన విషయం తెలిసిందే.

Similar News

News October 23, 2025

జుట్టు ఆరోగ్యానికి ఆముదం

image

ప్రస్తుతకాలంలో చాలామంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వాటికి ఆముదం పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే రిసినోలిక్ యాసిడ్, విటమిన్-ఇ , ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్లు మాడుపై రక్తప్రసరణను పెంచి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. అలాగే మాడుపై అలెర్జీ, వాపులను తగ్గించి తేమగా ఉండేలా చూస్తుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారించి జుట్టును ఆరోగ్యంగా చేస్తుందని చెబుతున్నారు. <<-se>>#Haircare<<>>

News October 23, 2025

ఇతిహాసాలు క్విజ్ – 44 సమాధానాలు

image

1. భరతుని మేనమామ ‘యధాజిత్తు’.
2. ఉత్తరుడు మత్స్య దేశపు రాజు అయిన విరాటరాజు, సుధేష్ణల కుమారుడు.
3. బ్రహ్మ నివసించే లోకం పేరు ‘సత్య లోకం’.
4. గరుడ పక్షి విష్ణువు వాహనం.
5. భారతదేశంలోని ఏకైక బ్రహ్మ ఆలయం రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 23, 2025

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు క్యాబినెట్ ఆమోదం

image

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లో సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించగా తాజాగా సీఎం అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ధ్రువీకరించారు.