News July 28, 2024

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. తెలంగాణకు జిష్ణుదేవ్ వర్మ, రాజస్థాన్‌కు హరిభౌ కిసన్ రావ్, సిక్కింకు ఓం ప్రకాశ్ మాథుర్, మహారాష్ట్రకు సీపీ రాధాకృష్ణన్, జార్ఖండ్‌కు సంతోష్ కుమార్ గంగ్వార్, ఛత్తీస్‌గఢ్‌కు రామన్ దేకా, మేఘాలయకు సీహెచ్ విజయశంకర్, అస్సాం, మణిపుర్‌కు లక్ష్మణ్ ప్రసాద్, పంజాబ్‌కు గవర్నర్‌గా, చండీగఢ్‌కు ఎల్జీగా గులాబ్ చంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.

Similar News

News February 13, 2026

అదృష్టం వరించింది.. టాస్‌తో గెలిచారు

image

TG: దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడో వార్డు కౌంటింగులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. BRS అభ్యర్థి కంకణాల ఎల్లవ్వ, బీజేపీ అభ్యర్థి శ్రీలత మధ్య చివరి వరకు తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా ఫలితం మారలేదు. దీంతో అభ్యర్థుల సమ్మతితో టాస్ వేయగా ఎల్లవ్వను అదృష్టం వరించింది. దీంతో ఆమెను విజేతగా ప్రకటించారు.

News February 13, 2026

పిల్లల్లో మలబద్ధకానికి కారణాలివే..

image

పిల్లల్లో మలబద్ధకానికి ఎన్నో కారణాలుంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తగినంత ఫైబర్, నీరు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందంటున్నారు. IBS సమస్య ఉన్న చిన్నారుల్లో కూడా మలబద్ధకం కామన్‌గా కనిపిస్తుంది. ప్రయాణాలు, క్రమరహిత భోజన సమయాలు, జీవనశైలిలో తీవ్రమైన మార్పులు జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్లో అసౌకర్యాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు.

News February 13, 2026

గద్వాల జేజమ్మకు షాక్: బలం చూపని బీజేపీ

image

TG: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో BJP పెద్దగా ప్రభావం చూపించలేదు. MP డీకే అరుణకు మున్సిపల్ ఫలితాలు షాక్ ఇచ్చాయి. తన సొంత అసెంబ్లీ సెగ్మెంట్ గద్వాలలో పోటీ ఇవ్వలేకపోయారు. అక్కడ 32 వార్డుల్లో కేవలం 6 చోట్ల మాత్రమే BJP గెలిచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా మహబూబ్‌నగర్లో ప్రచారం చేశారు. అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో కాషాయ జెండా ఎగరలేదు. ఈ ఫలితాలు డీకే అరుణకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.