News December 12, 2024
తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి
TG: రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరీనాథ్పై ఆయన 34 ఓట్ల తేడాతో నెగ్గారు. జితేందర్కు 43 ఓట్లు రాగా, చాముండికి 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాగా టీఓఏ కార్యదర్శిగా మల్లారెడ్డి, కోశాధికారిగా డి.సతీశ్ గౌడ్ ఎంపికయ్యారు. మరో 23 పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. త్వరలోనే జితేందర్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది.
Similar News
News December 12, 2024
‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా పాక్ క్రికెటర్
ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా పాకిస్థాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ ఎంపికయ్యారు. నవంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకుగానూ ఐసీసీ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జస్ప్రీత్ బుమ్రా, మార్కో జాన్సెన్ కూడా ఈ అవార్డుకు పోటీపడ్డారు. కాగా గత నెలలో రవూఫ్ ఒక ఐదు వికెట్ల ప్రదర్శనతోపాటు మొత్తం 18 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో ఆయన అద్భుతంగా రాణించారు.
News December 12, 2024
బౌన్సర్లు ఎవరిపైనైనా దాడులు చేయొచ్చా?
ప్రస్తుతం బౌన్సర్ల వినియోగం పెరిగిపోతోంది. హోటళ్లు, పబ్బులు, మాల్స్, ఈవెంట్లలో జనాన్ని అదుపు చేసేందుకు వీరిని ఉపయోగిస్తుంటారు. కొందరు బౌన్సర్లు భద్రత పేరుతో అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తున్నారు. పస్రా చట్టం ప్రకారం ఇతరులపై దాడులు చేయడానికి వీరికి హక్కు లేదు. వారు దాడి చేస్తే కేసు పెట్టొచ్చు. బౌన్సర్లకు కచ్చితంగా PSLN నంబర్, కోడ్ ఉండాలి. బౌన్సర్ల వ్యవస్థ ఉండాలా వద్దా అనేదానిపై మీ కామెంట్.
News December 12, 2024
రేవంత్.. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?: KTR
TG: అర్ధసత్యాలు, అభూత కల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని CM రేవంత్ని KTR ప్రశ్నించారు. ‘మీ మాటలు అబద్ధం, మీ చేతలు అబద్ధం. కాకిలెక్కలతో మోసగించడమే మీ విధానమా? రూ.50-65వేల కోట్ల వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరికోసం? ఢిల్లీకి మూటలు మోసేందుకా? నీ జేబు నింపుకునేందుకా? అబద్ధానికి అంగీ, లాగు వేస్తే రేవంత్ అని మళ్లీ నిరూపించుకున్నారు. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?’ అని ఫైర్ అయ్యారు.