News July 16, 2024

తెలుగులో జీవో.. వెంకయ్య నాయుడు అభినందనలు

image

తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ మార్గదర్శకాల జీవోను తెలుగులో ఇవ్వడం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ‘ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి అర్థమయ్యే భాషలోనే ఉత్తర్వులు, పరిపాలన సమాచారం ఉండాలని ఎప్పటినుంచో చెబుతున్నా. సీఎం రేవంత్, వ్యవసాయశాఖ కార్యదర్శికి అభినందనలు. తెలుగు రాష్ట్రాలు ఇక నుంచి ఉత్తర్వులన్నీ పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 1, 2025

రైతులు అప్రమత్తంగా ఉండాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటలపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News December 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

image

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 1, 2025

వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

image

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.