News November 1, 2024

J&K బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

image

జమ్మూకశ్మీర్‌‌లోని నగ్రోటా BJP MLA దేవేందర్ సింగ్ రాణా(59) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్‌కు ఈయన సోదరుడు. దేవేందర్ మృతిపై J&K Dy.cm సురేందర్, PDF చీఫ్ ముఫ్తీ, BJP నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈయన 2014లో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి MLAగా గెలిచారు. తర్వాత బీజేపీలో చేరి తాజాగా 30,472 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

Similar News

News November 21, 2025

RRB-NTPC ఫలితాలు విడుదల

image

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.

News November 21, 2025

ఢిల్లీ హైకోర్టులో గౌతమ్ గంభీర్‌కు ఊరట

image

భారత్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లైసెన్స్ లేకుండా కొవిడ్-19 మందులు నిల్వ చేసి, పంపిణీ చేశారని గంభీర్, కుటుంబ సభ్యులు, ఛారిటబుల్ ఫౌండేషన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పు చెప్పారు. ఫిర్యాదును కొట్టివేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి తీర్పు రావాల్సి ఉంది.

News November 21, 2025

ఆముదంతో ఎన్నో లాభాలు

image

చాలామంది ఇళ్లల్లో లభించే ఆముదం నూనెలో ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ ఇ, యాంటి ఆక్సిడెంట్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఇది వాడటం వల్ల జుట్టుకు అవసరమైన పూర్తి పోషణ అందుతుంది. జుట్టు రాలడం, చిట్లి పోవడం తగ్గి, కుదుళ్లు బలపడతాయి. ఎక్కువ జిడ్డుగా ఉంటుందని చాలామంది దీన్ని వాడటం మానేస్తారు. కానీ జుట్టు పెరగాలని కోరుకునేవారు ఆముదం నూనె ఎంచుకోవచ్చు.