News March 16, 2024

లోక్‌సభ పోలింగ్ తర్వాత J&K ఎన్నికలు: రాజీవ్‌కుమార్

image

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై CEC రాజీవ్‌కుమార్ స్పందించారు. ‘లోక్‌సభ పోలింగ్ తర్వాత అక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తాం. భద్రతా కారణాలతో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10-12 మంది చొప్పున.. మొత్తం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు ఉంటారు. ప్రతి ఒక్కరికీ భద్రత అందించాలి. అందుకే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించలేం’ అని ఆయన తెలిపారు.

Similar News

News November 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 80

image

ఈరోజు ప్రశ్న: ఉప పాండవులను చంపింది ఎవరు? ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 28, 2025

అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

image

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.

News November 28, 2025

నేషనల్ ఫొరెన్సిక్ సైన్సెస్ వర్సిటీలో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>ఫొరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ 27 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ, MCA, ME, M.TECH, LLM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500. డిసెంబర్ 8, 9, 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.nfsu.ac.in