News August 23, 2024

JK ఎన్నికలు: కాంగ్రెస్‌కు షా 10 ప్రశ్నలు

image

జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌కు కేంద్ర హోమంత్రి అమిత్ షా <>10 ప్రశ్నలు<<>> వేశారు. అందులో కొన్ని..
* NC అన్నట్టు JKకు ప్రత్యేక పతాకం ఉండాలన్నదే కాంగ్రెస్ కోరికా? * ఆర్టికల్ 370, 35ఏ పునరుద్ధరించి టెర్రరిజం, అశాంతి పెంచుతారా? * టెర్రరిస్టులు, రాళ్లు విసిరేవాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా? * దళితులు, గుజ్జర్లు, బకర్‌వాలాలు, పహాడీల రిజర్వేషన్లు తొలగిస్తారా?

Similar News

News January 15, 2025

BREAKING: చంద్రబాబుకు భారీ ఊరట

image

AP: సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఈ కేసులో 2023 నవంబర్‌లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం SCని ఆశ్రయించింది.

News January 15, 2025

గేమ్ ఛేంజర్ NETT కలెక్షన్స్ ఎంతంటే?

image

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా 5 రోజుల్లో ₹100కోట్ల NETT కలెక్షన్స్ సాధించినట్లు ఇండియా టుడే తెలిపింది. తొలి రోజు ₹51కోట్లు, తర్వాతి 4 రోజుల్లో వరుసగా ₹21.6కోట్లు, ₹15.9కోట్లు, ₹7.65కోట్లు, ₹10 కోట్లు వసూలు చేసిందని పేర్కొంది. మొత్తం <<15125676>>NETT<<>> వసూళ్లు ₹106.15 అని పేర్కొంది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈనెల 10న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

News January 15, 2025

BIG BREAKING: KTRకు షాక్.. క్వాష్ పిటిషన్ డిస్మిస్

image

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరగాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కోనున్నారు. ఇప్పటికే ఏసీబీ ఒకసారి ఆయన్ని విచారించింది.