News January 20, 2025
J&K ఎన్కౌంటర్: భారత జవాన్ వీరమరణం
J&Kలో జరిగిన ఎన్కౌంటర్లో భారత ఆర్మీ జవాన్ పంగల కార్తీక్ వీరమరణం పొందారు. నార్త్ కశ్మీర్లోని జలూరా సోపోరాలో ఇవాళ ఇస్లామిస్ట్ తీవ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో కార్తీక్ తీవ్రగాయాలపాలవడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరికొందరు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.
Similar News
News January 21, 2025
అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ: ట్రంప్
2025 అమెరికా ప్రజలకు స్వేచ్ఛాయుత సంవత్సరం అని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తాం. అక్రమ వలసలు అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటాం. భిన్న సంస్కృతుల, సంప్రదాయాల కలయికే అమెరికా. దేవుడి దయ వల్ల తుపాకీ కాల్పుల నుంచి బయటపడ్డా. అమెరికా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తా. రాజ్యాంగబద్ధంగా, ప్రజస్వామ్యబద్ధంగా పని చేస్తాం’ అని ట్రంప్ అన్నారు.
News January 21, 2025
సంచలనం: కుటుంబసభ్యులకు బైడెన్ క్షమాభిక్ష
అధికారం నుంచి దిగిపోయే 20 ని.ల ముందు బైడెన్ తన కుటుంబానికి చెందిన ఐదుగురికి క్షమాభిక్ష ప్రకటించారు. వారు ఎలాంటి తప్పు చేయలేదని, ట్రంప్ రాజకీయ దాడులకు బలవుతారనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. క్షమాభిక్ష పొందినవారిలో బైడెన్ సోదరుడు జేమ్స్, అతడి భార్య సారా, బైడెన్ సోదరి వలేరి, ఆమె భర్త జాన్, బైడెన్ మరో సోదరుడు ఫ్రాన్సిస్ ఉన్నారు. 2024 DECలోనూ తన కుమారుడికి క్షమాభిక్ష ప్రకటించారు బైడెన్.
News January 20, 2025
మొబైల్ రీఛార్జ్లపై GOOD NEWS
రీఛార్జ్ చేయకపోయినా సిమ్ ఎక్కువ కాలం యాక్టివేట్గా ఉండేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చింది. జియో, ఎయిర్టెల్, Vi యూజర్స్ 90 రోజులు, BSNLకు 180 రోజుల పాటు యాక్టివేట్గా ఉంటాయని తెలిపింది. అనంతరం సిమ్ Deactivate కాకుండా ఉండాలంటే నెట్వర్క్ను అనుసరించి రీఛార్జ్ చేసుకోవాలంది. ఇది రూ.20తో స్టార్ట్ చేయాలని ట్రాయ్ సూచించింది. 2 సిమ్ కార్డులు వాడేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.