News October 16, 2024

J&K మంత్రివర్గంలో చేరట్లేదు: కాంగ్రెస్

image

జమ్మూకశ్మీర్ సీఎంగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో JKPCC చీఫ్ తారిక్ హమీద్ కర్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రస్తుతానికి J&K ప్రభుత్వ మంత్రివర్గంలో చేరట్లేదని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలనే డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దీని కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని ఇదే హామీని ఇచ్చారని గుర్తు చేశారు.

Similar News

News January 1, 2026

HYDలో కొత్త ట్రెండ్.. ఇదే బెస్ట్ స్పాట్..!

image

HYD‌లో ఏ వేడుక జరిగినా ఇప్పుడు అందరి చూపు డాక్టర్‌ బీ.ఆర్. అంబేడ్కర్ సెక్రటేరియట్ వైపే ఉంటోంది. IPL‌లో RCB విజయం, న్యూ ఇయర్ వేడుకలను సీపీ సజ్జనార్ ఇక్కడే జరుపుకోవటం విశేషం. సెక్రటేరియట్ అద్భుతమైన నిర్మాణ శైలి, విద్యుత్ వెలుగులతో ఈ ప్రాంతం పర్యాటకానికి ‘బెస్ట్ స్పాట్’గా మారింది. అమరజ్యోతి, భారీ అంబేడ్కర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ అందాలను వీక్షించేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు.

News January 1, 2026

సౌదీలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష

image

సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు రికార్డు స్థాయికి చేరింది. 2025లో ఏకంగా 356 మందికి మరణ దండన అమలు చేసింది. ముఖ్యంగా డ్రగ్స్ రవాణాపై సౌదీ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం కారణంగానే ఈ సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం శిక్షల్లో 243 డ్రగ్స్ కేసులే కావడం గమనార్హం. ఓవైపు పర్యాటకం, క్రీడలతో ఆధునిక దేశంగా ఎదగాలని యత్నిస్తున్న సౌదీ, మరోవైపు ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

News January 1, 2026

అంచనాకు మించి అయ్యప్ప బంగారం చోరీ: SIT

image

శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ అంచనా కంటే ఎక్కువే అని కొల్లాం కోర్టుకు SIT తెలిపింది. సన్నిధానం తలుపులకు గల ఆకృతులతో పాటు శివుడి విగ్రహం, ఆర్చ్, ద్వారపాలక విగ్రహాలు సహా 7ఆకృతుల్లో పసిడి చోరీ అయిందని రిపోర్టు సమర్పించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టాక 4.5KGల మేర బంగారాన్ని రికార్డుల్లో రాగి అని మార్చాడని పేర్కొంది. చెన్నైలో కెమికల్స్‌తో బంగారం కరిగించారని తెలిపింది.