News October 9, 2024

JK: బీజేపీకి గణనీయంగా పెరిగిన ముస్లిం ఓట్లు

image

JK ఓటర్ల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. తమకు వ్యతిరేకంగా భావించే BJPకి ముస్లిములు గణనీయంగా ఓట్లేశారు. గురెజ్‌లో 97% ఓటర్లు ముస్లిములే. ఇక్కడ BJP అభ్యర్థి ఫకీర్ మహ్మద్ 1132 ఓట్లతో ఓడిపోయారు. ఆయనకు 40.3%, విజేత నజీర్ అహ్మద్ (NC)కు 46.64% ఓట్లు పడ్డాయి. 70% ముస్లిములు ఉండే కిష్టావర్‌లో BJP అభ్యర్థి షగున్ పరిహార్ 521 ఓట్లతో గెలిచారు. మొత్తం ఓట్లలో ఆమెకు 48%, ప్రత్యర్థి సాజద్‌ (NC)కు 47.14% వచ్చాయి.

Similar News

News December 2, 2025

Karnataka: సిద్ద-శివ నాటు చికెన్ ‘బ్రేక్‌ఫాస్ట్’

image

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మరోసారి భేటీ అయ్యారు. ఇవాళ బెంగళూరులో శివకుమార్ ఇంట్లో ఈ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఇడ్లీ, దోశ, ఉప్మా, నాటు చికెన్‌‌ అల్పాహారంగా తీసుకున్నారు. సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు CMకు బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేసినట్లు శివకుమార్ ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా CM అంశంపై ఇరు వర్గాల మధ్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.

News December 2, 2025

‘కోహ్లీ’ దిగ్గజాలను దాటేశారు: ఫ్యాన్స్

image

SAపై తాజా సెంచరీతో వన్డేల్లో కోహ్లీ 52 సెంచరీలు చేసి ఓ ఫార్మాట్లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గా నిలిచారు. అయితే సెంచరీల్లో దిగ్గజ ప్లేయర్లను విరాట్‌ ఎప్పుడో దాటేశారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కోహ్లీ వన్డేల్లో 294 ఇన్నింగ్స్ ఆడారని, ఇదే సంఖ్యలో ఆడిన తర్వాత సచిన్ సెంచరీలు 33 అని, పాంటింగ్ 26, గేల్ 25 శతకాలు బాదారని పోస్టులు పెడుతున్నారు. బ్యాటింగ్ AVG కూడా కోహ్లీ(58)దే ఎక్కువ అని చెబుతున్నారు.

News December 2, 2025

ఫోన్లలో Govt యాప్.. నిఘా కోసమేనా?

image

ఫోన్లలో ప్రభుత్వ ‘సంచార్ సాథీ’ యాప్‌ <<18439451>>డిఫాల్ట్‌గా<<>> ఉండాలన్న కేంద్రం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నేరాలకు అడ్డుకట్ట వేసే పేరుతో ప్రజలపై నిఘా పెట్టాలనుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రష్యా, నార్త్ కొరియా వంటి దేశాల్లోనే డిలీట్ చేసేందుకు వీలులేని ఇలాంటి యాప్స్ ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నార్త్ కొరియాలా తమపై నిఘా పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?