News November 8, 2024
JKAssembly: ఏమిటీ సెక్షన్ 35A?
జమ్మూకశ్మీర్లో తిరిగి ఆర్టికల్స్ 370, 35A అమలుకై నేషనల్ కాన్ఫరెన్స్ MLAలు అసెంబ్లీలో డిమాండ్ చేస్తున్నారు. A 370 JKకు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తే, 35A శాశ్వత నివాసితులను నిర్ణయించే అధికారం ఆ శాసనసభకు రాజ్యాంగం కల్పిస్తుంది. ఈ రెసిడెంట్స్కే ఓటు హక్కు, స్థిర, చరాస్తుల కొనుగోలు/అమ్మకం, ప్రభుత్వ ప్రయోజనాలు హక్కులుంటాయి. JK ఆడవారు మరో రాష్ట్ర పురుషుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు శాశ్వత హోదా పోతుంది.
Similar News
News November 8, 2024
విజయమ్మ, షర్మిలపై జగన్ పిటిషన్.. విచారణ వాయిదా
AP: విజయమ్మ, షర్మిలతో ఆస్తుల వివాదంపై జగన్ దాఖలు చేసిన పిటిషన్పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో విచారణ జరిగింది. తనకు తెలియకుండా తల్లి, చెల్లి షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట షేర్లు కొనసాగేలా చూడాలని కోరారు. కౌంటర్ దాఖలకు విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో విచారణను వచ్చే నెల 13కు ఎన్సీఎల్టీ వాయిదా వేసింది.
News November 8, 2024
మళ్లీ ‘అమ్మ’ అధ్యక్ష బాధ్యతలు చేపట్టను : మోహన్ లాల్
మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(AMMA) అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపడతారన్న వార్తలను హీరో మోహన్ లాల్ కొట్టిపారేశారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. అవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో నటీమణులపై వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సంచలన విషయాలు బయట పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అమ్మ అధ్యక్షుడు మోహన్ లాల్ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన రిజైన్ చేశారు.
News November 8, 2024
రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ: మంత్రి అచ్చెన్న
AP: వైసీపీ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పుడు ఎలాంటి నిబంధనల అడ్డు లేకుండా రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. పంటను కొనుగోలు చేసిన 48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమచేస్తామని పునరుద్ఘాటించారు. రైతుల నుంచి ప్రతి గింజా కొంటామని స్పష్టం చేశారు.