News November 1, 2024

జేఎంఎం మొత్తం ఓ న‌కిలీ వ్య‌వ‌స్థ‌: హిమంత బిశ్వ

image

ఝార్ఖండ్ ముక్తి మోర్చా మొత్తం ఓ న‌కిలీ వ్య‌వ‌స్థ అని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ విమ‌ర్శించారు. CM హేమంత్ సోరెన్ వ‌య‌సుపై వివాదం రేగ‌డంపై ఆయ‌న స్పందించారు. ‘JMM వ్యవస్థ మొత్తం నకిలీ. అఫిడవిట్‌ను ప‌రిశీలిస్తే సోరెన్ వ‌య‌సు కూడా పెరిగింది. ఇది చొర‌బాటుదారుల‌ ప్రభుత్వం. JMMను తిరిగి అధికారంలోకి తీసుకొస్తే ఎవరూ సురక్షితంగా ఉండరు. ప్రజలు బాధ్యతగా వారిని గ‌ద్దెదించాలి’ అని శర్మ పిలుపునిచ్చారు.

Similar News

News November 1, 2024

అర‌బ్ అమెరిక‌న్ల‌లో అయోమ‌యం

image

గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు ఆయుధ‌, ఆర్థిక వ‌న‌రులు స‌మ‌కూరుస్తున్న డెమోక్రటిక్ ప్ర‌భుత్వంపై అర‌బ్ అమెరిక‌న్లు ఆగ్ర‌హంగా ఉన్నారు. 40 వేల మందికిపైగా పాల‌స్తీనియ‌న్ల న‌ర‌మేధంలో డెమోక్రాట్లు భాగ‌మ‌య్యార‌ని గుర్రుగా ఉన్నారు. అదే స‌మ‌యంలో వారు ట్రంప్‌ను పూర్తిగా న‌మ్మ‌లేని స్థితి. దీంతో తాను అధికారంలోకి వ‌స్తే గాజాలో యుద్ధం ఆపేలా చర్యలు తీసుకుంటానని ట్రంప్ వారిని ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు.

News November 1, 2024

డీకే వ్యాఖ్య‌ల‌తో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో కాంగ్రెస్‌!

image

క‌ర్ణాట‌క‌లో ఉచిత బ‌స్సు ప్ర‌యాణ ప‌థ‌కాన్ని స‌మీక్షిస్తామ‌న్న DK శివ‌కుమార్ వ్యాఖ్య‌ల‌తో కాంగ్రెస్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు ఆ పార్టీకి లాభం చేశాయి. ఇప్పుడు మ‌హారాష్ట్ర‌, ఝార్ఖండ్‌లో INC ఈ త‌ర‌హా హామీల‌ను ప్ర‌క‌టిస్తోంది. ఈ క్ర‌మంలో పథకాన్ని సమీక్షిస్తామని చెప్పడం ఇతర రాష్ట్రాల్లో హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తినట్టైంది.

News November 1, 2024

ఆ నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టారు: నోరా ఫతేహీ

image

కెరీర్ ఆరంభంలో చేసిన రెండు సినిమాల నిర్మాతలు తనకు డబ్బులు ఎగ్గొట్టారని నటి నోరా ఫతేహీ ఆరోపించారు. తాను వాటి గురించి కూడా పట్టించుకోలేదని, కెరీరే ముఖ్యమని నమ్మినట్లు చెప్పారు. ‘మోడల్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు దోపిడీకి గురయ్యా. ఏజెన్సీ వాళ్లు డబ్బులిచ్చేవారు కాదు. ఇంటి అద్దె కట్టలేకపోయా. యశ్‌రాజ్ ఫిల్మ్ వారికి ఆడిషన్ ఇవ్వగా అందంగా లేనన్నారు. కోపమొచ్చి ఫోన్ పగలకొట్టా’ అని ఆమె చెప్పుకొచ్చారు.