News July 23, 2024
JNTUలో ముగిసిన PHD పరీక్షలు

HYD కూకట్పల్లిలోని JNTUలో జరుగుతున్న PHD పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజుల్లో కలిపి మొత్తం 675 మంది పరీక్ష రాశారు. మొత్తం 930 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 72.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండోరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి 400 మంది పరీక్ష రాసినట్లు వర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్రావు చెప్పారు. నిబంధనలను అనుసరించి పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నారు.
Similar News
News December 19, 2025
HYD బుక్ ఫెయిర్ మొదలైంది అప్పుడే..!

హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి DEC 29 వరకు బుక్ ఫెయిర్ జరుగుతుంది. 1985లో మొదట అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమైన ఈ ఫెయిర్, తరువాత నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లకు విస్తరించింది. ప్రజల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News December 19, 2025
HYD: రైలు ప్రయాణికులకు GOOD NEWS

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాకినాడ-వికారాబాద్, సికింద్రాబాద్–కాకినాడ, తిరుపతి–VKB, నర్సాపూర్–వికారాబాద్, లింగంపల్లి–నర్సాపూర్, లింగంపల్లి–కాకినాడ, వికారాబాద్–కాకినాడ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. రైళ్లకు బుకింగ్ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 1.5% బుకింగ్ పూర్తి అయిందన్నారు.
News December 19, 2025
HYDలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు?

నగరంలో అసెంబ్లీ నియోజకవర్గాల ముఖచిత్రం మారబోతోంది. జనగణన తర్వాత జరిగే పునర్విభజనతో గ్రేటర్లోని సీట్లు 24 నుంచి ఏకంగా 30-33 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. ప్రస్తుతం GHMC వార్డుల విభజనలో కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో జనాభా 5 లక్షలు దాటినట్లు గుర్తించారు. మితిమీరిన జనాభా ఉండటంతో పాలనా సౌలభ్యం కోసం వీటిని చీల్చి, కొత్త స్థానాలను ఏర్పాటు చేయనున్నారు.


