News March 28, 2025

JNTUలో 70.41% పాస్ అయ్యారు

image

JNTU పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్ (R 18 రెగ్యులేషన్)పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. 28,480 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 27,533 విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 19,385 మంది అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించారు. 70.41% పాస్ పర్సంటేజ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు. ఫలితాలను JNTUH వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.

Similar News

News December 9, 2025

మెదక్: ఎన్నికల రోజు స్థానిక సెలవు

image

జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఆయా మండలాల్లో పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. డిసెంబర్ 11, 14, 17న పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు.

News December 9, 2025

స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఆరోగ్య అధికారి

image

జిల్లా ఆరోగ్య అధికారి డా. విజయలక్ష్మి స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలని కోరారు. పేడ పురుగు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ వ్యాధికి జ్వరం, దద్దుర్లు, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయని తెలిపారు. జీజీహెచ్‌లో IGM ELISA పరీక్ష అందుబాటులో ఉంది. పొదలు, పొలాల్లోకి వెళ్లేటప్పుడు పూర్తి దుస్తులు ధరించాలని, లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.

News December 9, 2025

మెదక్: సీఐటీయూ రాష్ట్ర మహాసభలు.. 39 తీర్మానాలు ఆమోదం

image

మెదక్ పట్టణంలో జరిగిన సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలు మంగళవారం ముగిశాయి. రాష్ట్ర కార్యదర్శి వీఎస్ రావు ప్రవేశపెట్టిన 39 తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా శ్రమశక్తి నీతి-2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.