News March 28, 2025

JNTUలో 70.41% పాస్ అయ్యారు

image

JNTU పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్ (R 18 రెగ్యులేషన్)పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. 28,480 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 27,533 విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 19,385 మంది అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించారు. 70.41% పాస్ పర్సంటేజ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు. ఫలితాలను JNTUH వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.

Similar News

News December 24, 2025

అల్లూరు జిల్లాలో విషాదం.. క్రిస్మస్ పండుగకు ఇంటికి వెళుతుంటే..

image

చింతూరు(M)లో పంచాయతీ కార్యదర్శులుగా చేస్తున్న <<18661155>>గెడ్డం సందీప్, పెయ్యల విద్యాసాగర్<<>> బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వారు గురువారం క్రిస్మస్ పండుగ అని అమలాపురం ఇంటికి వెళుతుండగా ఐ.పోలవరం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంపై తోటి ఉద్యోగులు శోకసంద్రంలో ఉన్నారు. జిల్లా అధికారులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

News December 24, 2025

ఇంటి దొంగతనాల నివారణకు ‘LHMS’ వాడండి: SP

image

జిల్లాలో ఇంటి దొంగతనాలను నివారించేందుకు ప్రజలు అత్యాధునిక ‘LHMS’ (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) సాంకేతికతను వినియోగించుకోవాలని SP డి.నరసింహకిషోర్ బుధవారం సూచించారు. ఈసౌకర్యం పూర్తిగా ఉచితమని, ఊర్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన సామాగ్రిని భద్రపరుచుకోవడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేయాలని SP ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News December 24, 2025

ఆరావళి మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం

image

ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని స్పష్టం చేసింది. ఆరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్ చేపట్టడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ‘SAVE ARAVALI’ అంటూ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. ఈక్రమంలోనే కేంద్రం వెనక్కి తగ్గింది.