News November 6, 2025
JNTUలో Way2News ఎఫెక్ట్

‘JNTU క్వార్టర్స్ ఖాళీ చేయాలని నోటీసులు.. పట్టించుకోని వైనం’ అని Way2Newsలో వచ్చిన కథనానికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. దీనిపై పూర్తి నివేదిక అందజేయాలని JNTUH అధికారులను కోరినట్లు సమాచారం. PhDలు పూర్తైనా వేరే వారికి అవకాశం ఇవ్వకుండా JNTUలో ఉంటూ పెత్తనాలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టేందుకు వర్సిటీ యంత్రాంగం సిద్ధమైనా.. కొందరు ప్రలోభాలు పెడుతూ ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Similar News
News November 6, 2025
ఎస్‌బీఐ PO ఫలితాలు విడుదల

SBIలో 541 ప్రొబెషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు రిలీజయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను <
News November 6, 2025
ఎలమంచిలి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఎలమంచిలి (M) కొక్కిరాపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివకాల మేరకు.. S రాయవరం (M) సర్వసిద్ధికి చెందిన అడబాల సాయిరామ్ గోవింద్ బైక్‌పై వెనుక కూర్చుని గ్రామం నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. సాయిరాం కింద పడిపోగా అతనిపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గోవిందు సురక్షితంగా బయటపడ్డాడు.
News November 6, 2025
సిద్దిపేట: ‘విధుల్లో అలసత్వం వద్దు’

సిద్దిపేట జిల్లా కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్లతో డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నిర్వహించిన పనితీరును(ప్రగతి) రివ్యూ నిర్వహించారు. DMHO మాట్లాడుతూ.. ప్రతి PHC, CHC, జిల్లా ఆస్పత్రుల్లో పేషెంట్లకు నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి అలసత్వం లేకుండా వైద్య సేవలు నిర్వహించాలని, సకాలంలో రిపోర్ట్స్ అందించాలని చెప్పారు. డ్యూటీ విషయంలో సమయపాలన పాటించాలని చెప్పారు.


