News March 11, 2025
JNTU: ఈనెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరణ

JNTU పరిధిలో 2025-26కు సంబంధించి అఫిలియేషన్ కాలేజీ పునరుద్ధరణలో భాగంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్లైన్లో కళాశాల నిర్వాహకులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా యూనివర్సిటీ సంబంధిత అధికారులను సంప్రదించి వారి సమస్యలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
ఆ డాక్టర్లకు 50శాతం ఇన్సెంటివ్!

TG: గిరిజన జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీకి బేసిక్ పేలో 50% అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రైబల్ ఏరియాకు వెళ్లేందుకు డాక్టర్లు ఇష్టపడట్లేదు. ఫలితంగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఏర్పడి గుర్తింపు కోల్పోయే ప్రమాదముంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి, ఆసిఫాబాద్, MLG, MHBD, భూపాలపల్లి కాలేజీలు గిరిజన ప్రాంతాల పరిధిలోకి వస్తాయి.
News December 1, 2025
కృష్ణా: నవోదయలో 21 మంది విద్యార్థులు సస్పెండ్.. కారణమిదే.!

వేలేరు నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న 21 మంది విద్యార్థులు అర్ధరాత్రి సాహసం చేసి సస్పెండయ్యారు. రాత్రి 10 గంటల తర్వాత హాస్టల్లోని ఎగ్జిట్ ఫ్యాన్ బెజ్జం తీసి, చిన్న రంధ్రం గుండా బయటపడ్డారు. హనుమాన్ జంక్షన్-నూజివీడు రోడ్డుకు వెళ్లి బిర్యానీ తెచ్చుకున్న ఈ విద్యార్థులను గుర్తించిన ప్రిన్సిపల్ తీవ్రంగా స్పందించి, వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసి ఇళ్లకు పంపినట్లు తెలిపారు.
News December 1, 2025
నల్గొండ: గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో జిల్లా మంత్రులు

రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ను పరిచయం చేస్తూ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎంతో కలిసి వారు ఆవిష్కరించారు.


