News March 11, 2025

JNTU: ఈనెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరణ

image

JNTU పరిధిలో 2025-26కు సంబంధించి అఫిలియేషన్ కాలేజీ పునరుద్ధరణలో భాగంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కళాశాల నిర్వాహకులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా యూనివర్సిటీ సంబంధిత అధికారులను సంప్రదించి వారి సమస్యలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 19, 2025

నేను పార్టీ మారలే.. BRSలోనే ఉన్నా: మహిపాల్ రెడ్డి

image

‘నేను పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. BRSలోనే కొనసాగుతున్నా’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. MLAల అనర్హత పిటిషిన్‌పై ఈనెల 25న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేఫథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీం జారీ చేసిన నోటీసులకు గానూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు.

News March 19, 2025

ఢిల్లీ వీధుల్లో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్

image

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఇండియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వీధుల్లో అక్కడి పిల్లలతో క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. ఆయనతో పాటు కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్‌ కూడా ఉన్నారు. ఇండియా, న్యూజిలాండ్‌ను ఏకం చేయడంలో క్రికెట్‌ను మించినది లేదని క్రిస్టోఫర్ ట్వీట్ చేశారు.

News March 19, 2025

ట్రాన్స్‌జెండర్ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

image

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ దారుణ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం.. అక్కడి నుంచి అనకాపల్లి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సీఎంకు తెలిపారు. కాగా ట్రాన్స్‌జెండర్‌ను చంపి ముక్కలుగా నరికి మూట కట్టి కశింకోట(M) బయ్యవరం వద్ద పడేసిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!