News December 10, 2024
JNTU డైరెక్టర్ కథనానికి స్పందించిన అధికారులు

నిబంధనలను అతిక్రమిస్తూ వ్యవహరిస్తున్న JNTU డైరెక్టర్ శీర్షికన Way2 Newsలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే డైరెక్టర్ ఉపయోగిస్తున్న కారుకు సంబంధించి బ్లాక్ ఫిలింను తొలగించడమే కాకుండా పెండింగ్‌లో ఉన్న ఫైన్స్ సైతం కట్టేశారు. అధికారిక అవసరాలకు ఉపయోగించాల్సిన వాహనాలను వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని వాటి పైన కూడా అధికారులు దృష్టి సారించాలని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
Similar News
News September 15, 2025
కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య.. జైలుకు నిందితులు

కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్లేక్ అపార్ట్మెంట్లో జరిగిన రేణు అగర్వాల్ హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. రాంచీ నుంచి నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను పోలీసులు కూకట్‌పల్లికి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెంట్‌పై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. కంది జైలుకు తరలించినట్లు సమాచారం.
News September 15, 2025
జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర: కేటీఆర్

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.
News September 15, 2025
జూబ్లీహిల్స్: ప్రతి బూత్‌కు 10 మంది

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ విజయం సాధించాలని సీఎం కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దాదాపు 407 బూత్‌లలో చురుకైన కార్యకర్తలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఒక్కో బూత్‌కు 10 మంది చొప్పున ఎంపిక చేసి హస్తానికే ఓట్లు దక్కేలా చూడాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నెల 21లోపు ఎంపిక పూర్తిచేయనున్నారు.