News September 13, 2025
JNTU: బీటెక్ 1st ఇయర్ 2nd సెమిస్టర్ ఫలితాలు

జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్ 1st ఇయర్ 2వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డైరెక్టర్ విడుదల చేశారు. పరీక్షకు 16,521 మంది నమోదు చేసుకోగా 15,762 మంది హాజరయ్యారు. పరీక్షలు అన్ని సబ్జెక్టులలో 6,680 పూర్తిస్థాయి ఉత్తీర్ణత సాధించగా 42.38% పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
Similar News
News April 5, 2026
మాచర్ల CI వెంకటరమణ సస్పెన్షన్

AP: ప్రేమ వివాహం చేసుకున్న <<19545664>>చౌడేశ్వరిని<<>> నిబంధనలకు విరుద్ధంగా, బలవంతంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించినందుకు మాచర్ల CI వెంకటరమణను జిల్లా SP సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన బాధితురాలి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. CI అప్పగించిన కాసేపటికే ఆమె హత్యకు గురవడంతో ఈ నేరంలో ఆయన పాత్రపై ఆరోపణలొచ్చాయి. దీంతో CIపై SP కృష్ణారావు చర్యలు తీసుకున్నారు.
News April 5, 2026
నల్గొండ: ‘వడదెబ్బ’.. తస్మాత్ జాగ్రత్త..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడమే మంచిది. తప్పనిసరి అయితే గొడుగు, టోపీ వాడాలి. డీహైడ్రేషన్ కాకుండా నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. కాగా, నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామానికి చెందిన బుడిగె శంకరయ్య వడదెబ్బతో శనివారం చనిపోయిన విషయం తెలిసిందే.
News April 5, 2026
ఆసిఫాబాద్: పెళ్లి కావడం లేదని యువకుడి సూసైడ్

వివాహం కావడం లేదని ఓ ప్రైవేట్ కళాశాల ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ASF జిల్లా కౌటాలకు చెందిన దుర్గం కిరణ్ (36) కొన్ని ఏళ్లుగా పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిగిరి రాలేదు. దీంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గ్రామ సమీపంలోని వ్యవసాయ చేనులో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


