News July 8, 2025

JNTU: వారిని తక్షణం సస్పెండ్ చేయండి: విద్యార్థులు

image

JNTU సుల్తాన్‌పూర్ కళాశాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేసి విద్యార్థులకు విద్యను అభ్యసించే వాతావరణాన్ని నెలకొల్పాలి కోరుతూ వర్సిటీ రిజిస్ట్రార్‌కు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థులు వారి సమస్యలు చెప్పుకోలేక మెయిల్స్ ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలి అని విద్యార్థి నేతలు కోరారు.

Similar News

News July 9, 2025

ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకు?: KTR

image

TG: చర్చకు వచ్చే ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని ఆయనే సవాల్ విసిరారు. నేను దాన్ని స్వీకరించి, 72 గంటల నోటీస్ ఇచ్చా. ఇవాళ అందరి సమక్షంలో గంటపాటు వేచి చూసినా ఆయన రాలేదు. ఇంతమాత్రం దానికి సవాల్ విసరడం ఎందుకు రేవంత్ రెడ్డి?’ అని ట్వీట్ చేశారు. దీనికి ‘కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ’ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.

News July 9, 2025

ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం ఎత్తివేసే కుట్ర: ఆర్.కృష్ణయ్య

image

కాలేజ్ విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీంను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగా ట్రస్ట్ బ్యాంక్ నిధి అనే సరికొత్త ప్రతిపాదన కాలేజీ యాజమాన్యాల ద్వారా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు.

News July 9, 2025

బెట్టిగ్‌కి దూరంగా ఉండాలి: ఎస్పీ

image

ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్ నుంచి దూరంగా ఉండాలని ప్రజలకు ఎస్పీ తుషార్ డూడి సూచించారు. కష్టపడి సంపాదించిన డబ్బును జూదంపై ఖర్చు చేయొద్దన్నారు. జిల్లాలో ఎవరైన ఆన్‌లైన్ గేమ్స్, డ్రగ్స్, బెట్టింగ్స్‌కు పాల్పడినా లేదా నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారిపై 83338 13228కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.