News October 18, 2025
JNTU: Pharm.D ఫలితాలు విడుదల

అనంతపురం JNTU పరిధిలో ఆగష్టులో నిర్వహించిన Pharm.D 1, 2 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R17) పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ రిలీజ్ చేశారు. ఫలితాల కోసం jntuaresults.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
Similar News
News October 19, 2025
సదాశివనగర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

సదాశివనగర్ మండలం బొంపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. గాంధారి మండలానికి చెందిన అరవింద స్వామి ద్విచక్ర వాహనంపై సదాశివనగర్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 19, 2025
కరీంనగర్‌లో 22న జాబ్ మేళా.!

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి తిరుపతి రావు తెలిపారు. వరుణ్ మోటార్స్ సంస్థలో ఉన్న 50 పోస్టులకు ITI, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు 20-35 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని అన్నారు. వేతనం రూ.10 వేల నుంచి ప్రారంభమౌతుందని, ఆసక్తి గలవారు 22న పేరు నమోదు చేసుకోవాలన్నారు. 8143865009, 9963177056, 8886619371, 7207659969కు సంప్రదించాలన్నారు.
News October 19, 2025
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. రోకోపైనే అందరి దృష్టి

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా ఇవాళ తొలి వన్డే ఆడనుంది. ODI కెప్టెన్‌గా గిల్‌కిదే తొలి మ్యాచ్ కాగా AUSను ఎలా ఎదుర్కొంటాడో అనేది ఆసక్తిగా మారింది. 7 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్, కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. కీలక ప్లేయర్లు అందుబాటులో లేకున్నా స్వదేశంలో ఆసీస్‌ను తక్కువ అంచనా వేయలేం. మ్యాచ్ 9amకు ప్రారంభమవుతుంది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.