News January 7, 2025

JNTUA పరీక్షా ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU పరిధిలో గత సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన MBA 3, 4 సెమిస్టర్లు, MCA 3, 4, 5 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Similar News

News January 9, 2025

‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అందుకే రద్దు చేశాం: బాలకృష్ణ

image

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అనంతపురంలో ఈ రోజు జరగాల్సిన ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశారు. ‘తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విషాధ సమయంలో ఈవెంట్ జరపడడం సముచితం కాదు. అందుకే రద్దు చేశాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది’ అని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ తెలిపారు.

News January 9, 2025

మంత్రి నారా లోకేశ్ అనంతపురం పర్యటన రద్దు

image

తిరుపతిలో తొక్కిసలాట కారణంగా మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన రద్దయింది. బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో మంత్రి నేటి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ అనంతపురంలో జరిగే ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాల్సి ఉంది. సినీ ప్రముఖులతోనే ఈవెంట్ యథాతథంగా కొనసాగనుంది.

News January 9, 2025

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

image

అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భ్రమరాంబ దేవి తెలిపారు. అందులో ఎఫ్ఎన్‌వో 18, సానిటరీ అటెండర్, వాచ్‌మెన్ 11 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులు ఈనెల 20వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.