News March 28, 2025
JNTUHలో ఉద్యోగులకు జీతాల పెంపు ఎప్పుడు..?

JNTUHలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే హౌస్ కీపింగ్ ఉద్యోగులు జీతాల పెంపు విషయంలో ఇంజినీరింగ్ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాల పెంపు విషయంలో VDA అప్రూవల్ కోసం ఫైల్స్ పంపిన ఉన్నత అధికారులు దాని విషయంలో ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత వర్సిటీ VC వీటిపై వెంటనే నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు మేలు జరగుతుంది.
Similar News
News December 8, 2025
పాలమూరు: వార్డులు ఏకగ్రీవం.. సర్పంచ్ పదవికి పోటీ

కొత్తకోట మండలం రామనంతపూర్‌లో మొత్తం 8 వార్డులున్నాయి. రెండో విడత నామినేషన్‌లో భాగంగా సర్పంచ్ పదవికి ఆరుగురు, వార్డు మెంబర్లకు 24 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఏకగ్రీవంగా చేసి, నిధులతో దేవాలయం నిర్మించాలని తీర్మానించగా, నలుగురు అభ్యర్థులు తప్పుకున్నారు. కానీ యాదగిరిరెడ్డి, శివుడు పోటీ నుంచి తప్పుకోకపోవడంతో ఏకగ్రీవ చర్చలు విఫలమయ్యాయి. వార్డు మెంబర్‌లను మాత్రం ఏకగ్రీవం వరించింది.
News December 8, 2025
హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు!

వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా UIDAI కొత్త రూల్ తీసుకురానుంది. QR కోడ్ స్కానింగ్ లేదా ఆధార్ యాప్ ద్వారా వెరిఫై చేసేలా మార్పులు చేయనుంది. ఆధార్ వెరిఫికేషన్ కోరే హోటళ్ల రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది. యూజర్ల ప్రైవసీకి, డేటాకు రక్షణ కల్పించేందుకు UIDAI ఈ దిశగా అడుగులేస్తోంది. దీంతో ఓయో, ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకునే వారికి ఉపశమనం కలగనుంది.
News December 8, 2025
పల్నాడు: కమ్మేసిన పొగ మంచు

పల్నాడు ప్రాంతాన్ని మంచు దుప్పటి దట్టంగా కమ్మేయడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. మంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులు కూడా సరిగా కనపడటం లేదు. దట్టమైన మంచు తరచూ ప్రమాదాలకు కారణమవుతోంది. ఇటీవల చిలకలూరిపేట వద్ద మంచు కారణంగా వాహనం కనిపించక జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మంచు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


