News February 28, 2026
JNTUH ప్రొఫెసర్ల ప్రమోషన్లలో స్పష్టత లేదు

జేఎన్టీయూ ప్రొఫెసర్లకు CAS ప్రమోషన్ల విషయంలో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో నిర్వహించిన ఈసీ మీటింగ్‌లో ఈ ప్రమోషన్లు విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి JNTUH అధికారులు తీసుకొని రాగా ఆ ఫైలు ముందుకు కదల్లేదు. శుక్రవారం సైతం నిర్వహించిన మీటింగ్‌లో దీనిపైనా స్పష్టత రాలేదు. గత డిసెంబర్ ప్రొఫెసర్లకు ఇంటర్వ్యూ చేపట్టారు. ఇది ఇలానే కొనసాగితే గడువు ముగిసి మరోసారి ఇంటర్వ్యూలు చేపట్టాల్సి వస్తుంది.
Similar News
News February 28, 2026
స్కూల్ ఫీజులపై కీలక నిర్ణయం!

TG: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల పెంపునకు సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 11k స్కూళ్లలో ప్రస్తుత ఫీజులు, గత 3ఏళ్లలో స్కూళ్ల ఆదాయ వ్యయాల డేటాను సేకరించాలని నిర్ణయించింది. 2ఏళ్లకు 8% మాత్రమే పెంచుకునేలా అనుమతించాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలో ఫీజుల డ్రాఫ్ట్‌ను స్కూళ్ల వారీగా పబ్లిక్ డొమైన్‌లో పెట్టనుంది. ప్రజల అభిప్రాయాలను సేకరించి ఫీజులను ఖరారు చేయనుంది.
News February 28, 2026
KMR: ముగిసిన సర్పంచుల అవగాహన సదస్సు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సర్పంచుల అవగాహన సదస్సులో జడ్పీ సీఈవో చంద్రనాయక్ పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేసి గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలన్నారు. నిధుల వినియోగంలో జాగ్రత్తలు పాటించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. గ్రామ స్థాయిలో సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు.
News February 28, 2026
సీఎం పర్యటన విజయవంతం: VZM కలెక్టర్

సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఘనంగా.. విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, జేసీ సేధు మాధవన్, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, వివిధ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎటువంటి అసౌకర్యం లేకుండా పర్యటనను నిర్వహించామని పేర్కొన్నారు.


