News July 23, 2024
50,000 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్?

TG: నేడు ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనుంది. దాదాపు 50వేల పోస్టులతో ఈ క్యాలెండర్ ఉంటుందని అంచనా. ‘ప్రతి సంవత్సరం మార్చి 31లోపు అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తిస్తాం. జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇస్తాం. ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో డిసెంబర్ 9లోపు నియామక పత్రాలను పెట్టాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం’ అని సీఎం రేవంత్ గతంలో చెప్పారు.
Similar News
News March 27, 2026
దారుణం: బిడ్డ ఏడుస్తోందని..

AP: బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే క్షణికావేశం, అక్రమ సంబంధాలతో వారి ప్రాణాలు తీస్తున్నారు. తిరుపతి(D) నరసరాజు అగ్రహారంలో 5 నెలల కూతురు ఏడుస్తోందని తల్లి హేమావతి చంపేసింది. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసి ‘నీకో బ్యాడ్ న్యూస్. నాకో గుడ్ న్యూస్. పాపను చంపేశా’ అని చెప్పినట్లు సమాచారం. మార్కాపురం(D) త్రిపురాంతకంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కూతురు తులసి(9)ని తండ్రే హతమార్చాడు.
News March 27, 2026
‘శ్రీరామ’ అంటే అదే పుణ్య మంత్రం

శ్రీరామనవమి రోజున రామనామస్మరణం చేయాలని చెబుతుంటారు. రామ నామమును తారకమంత్రమని కూడా అంటారు. తారకమంత్రమంటే దేన్నైనా తేలికగా దాటించేది అని అర్థం. ఏ మంత్రము చెప్పినా దానిముందు ఓం అని.. తర్వాత నమః అని కచ్చితంగా వాడాలి. కానీ రామ నామానికి అలాంటి నియమాలేవీ లేవు. శ్రీరామ అంటే అదే పుణ్య మంత్రం. రామనామంతో ధ్యానం చేయడం వల్ల సకల పాపాలు తొలిగిపోతాయి.
News March 27, 2026
సాదాబైనామా రిజిస్ట్రేషన్లు.. కొత్త నిబంధనలివే

TG: ఇకపై దరఖాస్తు చేసేటప్పుడు భూమిని బదిలీ చేసే వ్యక్తి అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారుడి సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ సరిపోతుంది. తప్పుడు సమాచారం/పత్రాలు ఇస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. ‘భూ భారతి’లో నమోదుకు ముందు ఎవరైనా అభ్యంతరాలు తెలిపేందుకు 30days గడువుంటుంది. 5ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.


