News October 7, 2025

తూర్పుగోదావరి జిల్లాలో జాబ్ మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్లలో ఈనెల 8న 1014 పోస్టులకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 23 కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. ఆసక్తిగల టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ, ఎంబీఏ, బీబీఏ, ఎంఎస్సీ అర్హతగల అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 18 నుంచి 35ఏళ్ల లోపు గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Similar News

News October 7, 2025

నారదుని భక్తి సూత్రాలు – 3

image

‘అమృత స్వరూపా చ’… నారద భక్తి సూత్రాల్లో ఇది మూడోది. ఈ సూత్రం ప్రకారం.. నిజమైన భక్తి అనేది అమృతం లాంటిది. అది భక్తుడికి అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది. నిత్యమైన సంతృప్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. భగవంతునిపై అంకితభావంతో కూడిన ప్రేమను పొందిన తర్వాత, మనిషికి ఈ లోకంలోని తాత్కాలిక కోరికల పట్ల ఆసక్తి ఉండదు. ఈ భక్తి స్థితిలోనే భక్తుడు తనలో తాను రమిస్తూ, శాశ్వతమైన పరమానందంలో తేలియాడుతాడు. <<-se>>#NBS<<>>

News October 7, 2025

మహిళలకు చీరలు.. ఎప్పుడంటే?

image

TG: రాష్ట్రంలో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఇందిర జయంతి రోజైన నవంబర్ 19న ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. నిన్న సిరిసిల్లలో చీరల తయారీని ఆమె పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యుల గౌరవం పెంచేలా ఒకే రకం చీరలు ఇవ్వనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో బతుకమ్మ చీరలపైన నిర్ణయం తీసుకొని మహిళలందరికీ ఇచ్చేలా క్యాబినెట్‌లో చర్చిస్తామని చెప్పారు.

News October 7, 2025

బనకచెర్ల DPRకి ₹9.2 కోట్లతో టెండర్ల ఆహ్వానం

image

AP: పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ప్రభుత్వం ముందుకు కదులుతోంది. DPR తయారీకి రూ.9.2 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. CWC గైడ్ లైన్స్ ప్రకారం ఇది ఉండాలని పేర్కొంది. అవసరమైన పరిశోధనలు, కేంద్రం నుంచి చట్టపరమైన అన్ని అనుమతులు పొందడం, ఇతర పనులతో కూడిన ప్రాజెక్టుకు DPR ఇవ్వాలంది. TG-APల మధ్య వివాదంగా మారిన ఈ ప్రాజెక్టుపై ఇంతకు ముందు పంపిన నివేదికను కేంద్రం వెనక్కు పంపడం తెలిసిందే.