News March 27, 2025
3 నెలలకోసారి జాబ్ మేళాలు: సీఎం

AP: అన్ని నియోజకవర్గాల్లో ప్రతి 3, 6 నెలలకోసారైనా జాబ్ మేళాలు నిర్వహించాలని కలెక్టర్లను CM చంద్రబాబు ఆదేశించారు. స్కిల్ సెన్సస్ ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యువతకు స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ప్రతి జోన్కు ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలన్నారు. WFH విధానంలో వర్క్ చేసేందుకు రిజిస్టర్ చేసుకున్న వారికి ట్రైనింగ్ ప్రారంభించాలని సూచించారు.
Similar News
News March 31, 2025
IPL: నేడు ముంబై, కోల్కతా పోరు

IPLలో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా రెండు వరుస ఓటములతో సతమతమైన ముంబై ఇవాళ గెలవాలనే పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై గెలిచి పరువు నిలబెట్టుకోవాలని యోచిస్తోంది. మరోవైపు కేకేఆర్ ఇప్పటివరకు రెండు మ్యాచులాడి ఒకదాంట్లో గెలిచి, మరొకటి ఓడింది. మళ్లీ విజయంతో గాడిలో పడాలని ఆ జట్టు భావిస్తోంది.
News March 31, 2025
DEJAVU: అప్పుడు.. ఇప్పుడు ఒకేలా..!

ఐపీఎల్లో CSK, RR మధ్య ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 2023, 2025లో ఇరు జట్ల మధ్య ఒకే రీతిలో మ్యాచ్ జరిగింది. 2023లో CSK విజయానికి 21 రన్స్ అవసరం కాగా, 2025లో 20 రన్స్ అవసరమయ్యాయి. అప్పుడూ, ఇప్పుడూ క్రీజులో ధోనీ, జడేజా ఉన్నారు. అప్పుడు, ఇప్పుడూ బౌలర్ సందీప్ శర్మనే. అప్పుడు గెలిచింది, ఇప్పుడు గెలిచింది రాజస్థానే. ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు ‘DEJAVU’ అంటే ఇదేనేమో అని కామెంట్లు చేస్తున్నారు.
News March 31, 2025
బ్యాంకాక్లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనం.. అందరూ మృతి!

భూకంపం ధాటికి బ్యాంకాక్లోని ఓ 33 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ శిథిలాల్లో చిక్కుకున్నవారందరూ మరణించి ఉంటారని పోలీసులు తెలిపారు. లోపల నుంచి దుర్గంధం వస్తుండటంతో ఎవరూ ప్రాణాలతో ఉండరని అంచనా వేస్తున్నారు. కాగా బ్యాంకాక్ వ్యాప్తంగా భూకంపం వచ్చినా ఇది ఒక్క బిల్డింగ్ మాత్రమే కుప్పకూలింది. దీంతో దీనిని నిర్మించిన చైనా ఇంజినీరింగ్ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.