News December 26, 2024
ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

SBI 600 పీఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి అప్లికేషన్ విండో ఓపెన్ కానుంది. ఇది 16 జనవరి 2025 వరకు కొనసాగుతుంది. ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది.
వెబ్సైట్: <
Similar News
News November 6, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్ @2PM

*రేపు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 12కు వాయిదా
*హైదరాబాద్ బోరబండలో బండి సంజయ్ కార్నర్ మీటింగ్‌కు అనుమతి రద్దు చేశారంటూ బీజేపీ నేతల ఆందోళన.. సభ జరిపి తీరుతామని స్పష్టం
*జూబ్లీహిల్స్‌లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉందన్న కిషన్ రెడ్డి
*ఫిరాయింపు MLAలు తెల్లం వెంకట్రావు, సంజయ్‌లను నేడు విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
News November 6, 2025
సమగ్ర వ్యవసాయ విధానాలు (మోడల్స్)

☛ పంటలు + పశువులు +జీవాల పెంపకం.
☛ పంటలు + పశువులు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపల పెంపకం
☛ పంటలు + పశువులు + కోళ్లు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపలు + పుట్టగొడుగుల పెంపకం
☛ పంటలు + పశువులు + వర్మీ కంపోస్ట్ + చేపల పెంపకం
☛ పశువులు+ జీవాలు + కోళ్ల పెంపకం.. వాతావరణం, రైతు స్థితి, సహజ వనరులను బట్టి <<18185953>>సమగ్ర వ్యవసాయ<<>> అనుబంధ రంగాలను ఎంచుకోవచ్చు.
News November 6, 2025
ఓటేసేందుకు బిహారీల పాట్లు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ కోసం తెలుగు రాష్ట్రాల్లోని బిహారీలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. HYDలో 10-12 లక్షల మంది బిహారీలు ఉండగా AP, TGలో కలిపి ఈ సంఖ్య 15 లక్షల మందికి పైగానే ఉంటుంది. ఇవాళ, NOV 11న పోలింగ్ కోసం ఇప్పటికే ట్రైన్ టికెట్స్ బుక్ అయి వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. రైల్వే శాఖ 12వేల స్పెషల్ సర్వీసులు నడుపుతామని ప్రకటించినా రియాల్టీలో కన్పించక ఓటర్లు కష్టాలు పడుతున్నారు.


