News March 17, 2024
ఉద్యోగ నోటిఫికేషన్లు: HYDలో ఇదీ పరిస్థితి..!

గ్రూప్-1, DSC నోటిఫికేషన్లతో HYDలోని లైబ్రరీలకు తాకిడి పెరిగింది. అమీర్‌పేట, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లోని కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. TGలో అతిపెద్దదైన అఫ్జల్‌గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. రూ. 5 భోజనం తింటూ 8 నుంచి 10 గంటల సేపు చదువుతున్నారు. వీరి కోసం మౌలిక వసతులతో పాటు అదనపు పుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నట్లు లైబ్రేరియన్ తెలిపారు.
Similar News
News January 26, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు సిట్ అధికారులు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి హాజరుకావాలని కోరారు. సిట్ విచారణకు సహకరించాలన్నారు.
News January 26, 2026
గోల్కొండ, చార్మినార్ కట్టడాలకు TOP 10లో చోటు

గోల్కొండ, చార్మినార్ కట్టడాలు భాగ్యనగర పేరును ప్రపంచవ్యాప్తం చేశాయి. వాటి అందాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి వేలాది మంది వస్తుంటారు. దేశంలోని చారిత్రక ప్రాంతాలను చూసేందుకు వచ్చేవారు ఈ రెండింటిని చూడకుండా వెళ్లరు. అందుకే టాప్ 10 ప్రదేశాల్లో గోల్కొండ, చార్మినార్ చోటు సంపాదించుకున్నాయి. గోల్కొండ కోట 6వ స్థానం, చార్మినార్ 10వ స్థానంలో ఉన్నాయి.
News January 26, 2026
నాంపల్లి: రోజుకు 44వేల మంది సందడి చేస్తున్నారు

నుమాయిష్.. నగరవాసులు సరదాగా గడిపే ప్రాంతం. ఏటా JAN, FEB నెలల్లో నాంపల్లిలో నిర్వహించే ఎగ్జిబిషన్‌ను ఈ సంవత్సరం లక్షల మంది సందర్శిస్తున్నారు. ఈనెల 1 నుంచి ఇప్పటివరకు (25వ తేదీ వరకు) 11లక్షల మంది నుమాయిష్‌లో సందడి చేశారు. అంటే రోజుకు సరాసరి 44వేల మంది వస్తున్నట్లు. FEB 15 వరకు నగరవాసులకు ఈ వినోదం అందుబుటోల ఉంటుంది. ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.


