News April 7, 2024
చిన్నారిని కాపాడిన బాలికకు జాబ్ ఆఫర్

కోతుల బారి నుంచి చిన్నారిని కాపాడేందుకు చాకచక్యంగా వ్యవహరించిన 13 ఏళ్ల <<13002122>>బాలిక<<>>కు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఊహించని ఆఫర్ ఇచ్చారు. చదువు పూర్తయ్యాక ఆమె కార్పొరేట్ ఉద్యోగం చేయాలని అనుకుంటే తమ కంపెనీలో చేరవచ్చని తెలిపారు. టెక్నాలజీ ఎల్లప్పుడూ మానవ చాతుర్యానికి దోహదపడుతుందని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ఆమె సమయస్ఫూర్తి అభినందనీయమని కొనియాడారు.
Similar News
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.
News November 27, 2025
వైట్ ఎగ్స్‌కు రంగేసి నాటుకోడి గుడ్లంటూ..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో నకిలీ నాటు కోడి గుడ్లను తయారుచేస్తోన్న ముఠాను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. బ్రాయిలర్ ఎగ్స్(వైట్)కు రంగులు పూసి నాటు కోడి గుడ్లంటూ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 4.5లక్షలకు పైగా గుడ్లను రంగు మార్చి అమ్మినట్లు గుర్తించగా.. గోదాంలో రెడీ అవుతోన్న మరో 45వేల ఎగ్స్‌ను సీజ్ చేశారు. ఇలాంటి నకిలీ గుడ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.


