News November 21, 2024

రూ.20లక్షలు చెల్లిస్తేనే ఉద్యోగం: జొమాటో CEO

image

జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సీఈవో దీపిందర్ గోయల్ పిలుపునిచ్చారు. 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు వారు అర్హులని తెలిపారు. అయితే, దీనికి ఎలాంటి రెజ్యూమ్ అవసరం లేదని, జాయిన్ అవ్వాలంటే రూ.20లక్షలు విరాళంగా ఇవ్వాలన్నారు. వీటిని చారిటీకి అందిస్తామని, తనతోపాటు ఉంటూ నేర్చుకోవాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశం అని సూచించారు. ఇదొక లర్నింగ్ ప్రోగ్రామ్ మాత్రమే అని ప్రకటనలో చెప్పారు.

Similar News

News November 22, 2024

ట్రోల్స్ చూసి నా కొడుకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు: రోజా

image

ట్రోల్స్ చేసిన టీడీపీ, జనసేన కార్యకర్తలను వదలనని వైసీపీ నేత ఆర్కే రోజా అన్నారు. వారు చేసిన ట్రోల్స్ వల్ల తన కుమారుడు వారంపాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని ఎమోషనల్ అయ్యారు. ‘నా అన్నయ్య, కొడుకు ముద్దు పెట్టిన ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి వేధించారు. నా కూతురు, కుమారుడి సోషల్ మీడియా ఖాతాల్లో అసభ్యకర సందేశాలు పెట్టి ట్రోల్స్ చేశారు. దమ్ముంటే వారిని అరెస్ట్ చేయాలి’ అని ఆమె ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

News November 22, 2024

అదానీ స్కాంలో జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు.. ఖండించిన వైసీపీ

image

AP: వైఎస్ జగన్ ప్రభుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందనే <<14673251>>ఆరోపణలను<<>> వైసీపీ ఖండించింది. ‘ఏపీ డిస్కంలకు అదానీ గ్రూపునకు చెందిన ఇతర సంస్థలతో డైరెక్ట్ అగ్రిమెంట్ కుదరలేదు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన SECIతో CERC ఆమోదంతో 2021లో డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయి. తక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవడంతో రాష్ట్రానికి ఏడాదికి రూ.3వేల కోట్లు మిగిలాయి. రాష్ట్ర ప్రభుత్వంపై మోపిన అభియోగాలు తప్పు’ అని ట్వీట్ చేసింది.

News November 22, 2024

శ్రీశైలంలో ఉచిత బస్సు సౌకర్యం: EO

image

AP: శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపట్టినట్లు EO చంద్రశేఖర్ తెలిపారు. పండుగలు, పర్వదినాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ORR సమీపంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అక్కడి నుంచి గణేశ్ సదన్ మీదుగా అన్నదాన భవనం, డొనేషన్ సెంటర్, క్యూ కాంప్లెక్స్, నంది సర్కిల్ వరకు ఉ.5 నుంచి మ.12 వరకు ప్రతి అరగంటకు ఒక ఉచిత బస్సును నడపనున్నట్లు చెప్పారు.