News October 23, 2025

ఉద్యోగ ఒత్తిడి ప్రాణాంతకం: ప్రొఫెసర్

image

దీర్ఘకాలిక ఉద్యోగ ఒత్తిడి, టాక్సిక్ ఆఫీస్ కల్చర్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించి, అకాల మరణానికి కూడా దారితీయవచ్చని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జెఫ్రీ పిఫెర్ హెచ్చరించారు. అధిక పని గంటలు, ఉద్యోగ భద్రత లేమి వంటి అంశాలు ఒత్తిడి సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. హానికరమైన ఉద్యోగంలో కొనసాగడం వ్యక్తి శ్రేయస్సుకు ప్రమాదమని ఈ అంశాన్ని ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించారు.

Similar News

News October 24, 2025

బిహార్ ఎన్నికల్లో యువతదే కీలకపాత్ర: మోదీ

image

బిహార్‌లో ఆర్జేడీ ఆటవిక పాలన(జంగల్ రాజ్)పై మరో వందేళ్లయినా చర్చ జరుగుతుందని PM మోదీ అన్నారు. ప్రతిపక్షాల దురాగతాలను ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. ‘మేరా బూత్ సబ్‌సే మజ్ బూత్: యువ సంవాద్’ ఆడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గతంలో RJD చేసిన ఆకృత్యాలను నేటి యువతకు BJP నేతలు వివరించాలని సూచించారు. NDA పాలనలో బిహార్ అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర అని పేర్కొన్నారు.

News October 24, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 24, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.59 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.12 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.12 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.49 గంటలకు
✒ ఇష: రాత్రి 7.02 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు

News October 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.