News October 8, 2025
BRIC -NABIలో ఉద్యోగాలు

BRIC-నేషనల్ అగ్రి ఫుడ్ అండ్ బయో మాన్యుఫాక్చరింగ్ ఇన్‌స్టిట్యూట్ 6 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. సైంటిస్ట్ F, అసోసియేట్ ప్లాంట్ మేనేజర్, సైంటిస్ట్ C, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, PhD, ఎంటెక్/ఎంఈ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: http://ciab.res.in/
Similar News
News October 8, 2025
హైకోర్టులో తిరిగి ప్రారంభమైన విచారణ

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో విచారణ తిరిగి ప్రారంభమైంది. రిజర్వేషన్ల అమలు జీవోను వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కొన్ని ఇంప్లీడ్ పిటిషన్లకు నంబరింగ్ ఇవ్వలేదని మరో న్యాయవాది విచారణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ, న్యాయ వర్గాలు చెబుతున్నాయి.
News October 8, 2025
వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ రాసుకోవాలా?

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండి, మబ్బుల వల్ల సూర్యకిరణాలు తక్కువగా పడుతుంటాయి. దీంతో చాలామంది ఈ కాలంలో సన్‌స్క్రీన్ రాసుకోరు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. మబ్బులున్నా కూడా సూర్యరశ్మిలోని హానికరమైన UV రేస్ భూమిని చేరుకుంటాయి. ఇవి చర్మకణాలను దెబ్బతీస్తాయి. కాబట్టి సన్‌స్క్రీన్ స్కిప్ చేయకూడదంటున్నారు. సన్‌స్క్రీన్ ఎంచుకొనేటప్పుడు Broad-spectrum , SPF50 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని సూచించారు.
News October 8, 2025
రెండు సిరప్‌లపై ప్రభుత్వం నిషేధం

TG: రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్‌లను వాడొద్దని స్పష్టం చేసింది. ఈ రెండు దగ్గు సిరప్‌లలో అత్యంత విషపూరితమైన Diethylene Glycol (DEG) ఉందని పేర్కొంది. వీటి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్‌లో Coldrif సిరప్ వల్ల 20 మంది చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.