News October 13, 2025
ఇంటర్ యూనివర్సిటీ అసిలిరేటర్ సెంటర్‌లో ఉద్యోగాలు

ఇంటర్ యూనివర్సిటీ అసిలిరేటర్ సెంటర్ 7 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వెబ్‌సైట్: https://www.iuac.res.in
Similar News
News October 13, 2025
నకిలీ మద్యంపై CBIతో విచారణ చేయించాలి: YCP

AP: CBNకు చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐతో విచారణ జరిపించాలని YCP డిమాండ్ చేసింది. నేడు రాష్ట్రంలో ధర్నాలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందించినట్లు ఆ పార్టీ పేర్కొంది. తప్పు చేసిన వాళ్లే సిట్‌తో దర్యాప్తు చేయించడం హాస్యాస్పదమని విమర్శించింది. దోషులు ఎవరున్నా తక్షణమే అరెస్టు చేయాలని, కల్తీ సరకుతో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలంది. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేసింది.
News October 13, 2025
వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

14 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రీడా ప్రపంచాన్ని మెప్పించిన వైభవ్ సూర్యవంశీకి బిహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోషన్ ఇచ్చింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ తొలి 2 రౌండ్లకు వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఆ జట్టు కెప్టెన్‌గా సకీబుల్ గని వ్యవహరించనున్నారు. ఎల్లుండి నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కాగా IPLలో RR తరఫున అదరగొట్టిన వైభవ్.. ఇటీవల IND-U19 జట్టు తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించారు.
News October 13, 2025
ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్

EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(CBT) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెంబర్లు తమ అకౌంట్ నుంచి 100% డబ్బు డ్రా చేసుకొనే సదుపాయానికి ఆమోద ముద్ర వేశారు. ఎంప్లాయీతో పాటు ఎంప్లాయర్ షేర్ నుంచి 100% విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని వల్ల 7 కోట్ల మందికి పైగా ఉన్న ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. అటు 13 క్లాజులను 3 విభాగాలుగా విభజించారు. విద్య, ఇల్‌నెస్, వివాహాన్ని ‘అవసరాలు’ కేటగిరీలోకి తీసుకొచ్చారు.