News October 7, 2025
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో 4 మేనేజర్/లీగల్ పోస్టులకు కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతున్నారు. LLB, LLM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 10వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ /రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ircon.org/
Similar News
News March 26, 2026
చిరు, నాగబాబును అన్నయ్య అనే పిలుస్తా: అన్నా కొణిదెల

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనకు అన్నదమ్ములు లేరని, కానీ పెళ్లై కొణిదెల ఫ్యామిలీలోకి వచ్చాక చిరంజీవిని ‘అన్నయ్య’ అని, నాగబాబును ‘చిన్న అన్నయ్య’ అని పిలవడం భర్త నుంచి అలవాటైందని పేర్కొన్నారు. వరుసల పరంగా పిలుపులు వేరైనా.. మనసుతో వారిని తన సొంత సోదరులుగానే భావిస్తున్నానని ఆమె రాసుకొచ్చారు. మెగా బ్రదర్స్‌పై ఆమె చూపిన ఈ అనురాగం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
News March 26, 2026
మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా తిలాపియా రకం చేపలను పెంచుతామని తెలిపారు. రాష్ట్రంలో బలమైన పశుసంపద ఉందని, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
News March 26, 2026
కల్తీ పాల ఘటన.. CS, DGPకి NHRC నోటీసులు

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(NHRC) సుమోటోగా తీసుకుంది. ఈ ఉదంతంపై రెండు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ ఘటనలో 16 మంది <<19447985>>చనిపోయిన<<>> విషయం తెలిసిందే. ఇప్పటికీ పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


