News October 22, 2025
NIT ఢిల్లీలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

NIT ఢిల్లీలో 14 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, బీఈ, బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://nitdelhi.ac.in/
Similar News
News February 6, 2026
మునుగోడు: విద్యాశాఖ అధికారులకు పట్టని గోడు

మునుగోడు మండలం పలివెల జడ్పీ హైస్కూల్‌లో విద్యాశాఖ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. గత మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయుడు లేకపోవడంతో బోధన పూర్తిగా నిలిచిపోయింది. పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న వేళ, పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, వెంటనే టీచర్‌ను నియమించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
News February 6, 2026
నారాయణ నామంతో జైలు వాతావరణమే మారింది!

మంత్ర జపం మనసును ప్రశాంతపరిచి, అంతర్గత బంధనాల నుంచి విముక్తి కలిగిస్తుందని ఫారన్ రైటర్ ‘స్వామిని విశ్వప్రతిభ’ వెల్లడించారు. ఆమె కెనడాలోని ఓ జైలులో మహిళా ఖైదీలకు ఓంకార నాదం, నారాయణ మంత్రాలను బోధించారు. ‘ఓం నమో నారాయణాయ’ అంటూ ఖైదీలు జపించడంతో మానసిక ప్రశాంతతను పొందారని, సంతోషంగా ఉండగలిగారని ఆమె చెప్పారు. మంత్ర తరంగాలు జైలు వాతావరణంలో సానుకూల మార్పు తెచ్చాయని వెల్లడించారు.
News February 6, 2026
హోమ్, పర్సనల్ లోన్‌పై ప్రభావం ఉంటుందా?

ఆర్బీఐ రెపో రేటు(5.25)ను <<19064412>>యథాతథంగా<<>> ఉంచడంతో హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నవారికి EMIలలో ఎలాంటి మార్పులు ఉండవు. ఉదాహరణకు 30 ఏళ్లలో తీర్చేలా 8.20 శాతం వడ్డీతో రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే EMI రూ.37,346గా ఉంటుంది. అలాగే ఐదేళ్లలో తీర్చేలా 12 శాతం వడ్డీతో రూ.5 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటే EMI రూ.11,122గా ఉంటుంది.


